Saturday, December 16, 2017

హైకూ ద్విపాద తేనీలు - 121 - 140

1. గులాబీలు చిరుగాలికి ;  
కలల లిపిని హత్తినవి ; 
=
1. gulaabeelu ciru gaaliki ; 
  kalala lipini hattinawi ; 
;
2. చెలియ కురులే శరములవగా ; 
 నిలువ లేరు తిమిర వీరులెవరూ ; 
=
2] celiya కురులే Saramulaవగా ; 
 niluwa lEru timira weerulewaruu ;
;;
3. పుష్ప బాణాలన్నీ ఇటు వేసేసాడు ;
బహుశా అవి మరునికి బహుభారం ఐనవేమొ ;
;
4. సర్వదా భారం ఈ ప్రేమ ;
   వలదా!?, దాచగల మాయల పరదా  ;
;
5. అచ్చికబుచ్చికలాడే భ్రమరము ;
పుప్పొడి కొల్లలు గైకొని, మాయం  ; 
=
5. accikabuccikalADE bhramaramu ;
puppoDi kollalu gaikoni, maayam ;
;
6. మదనుని ఐదు శర పుష్పముల ;
పుప్పొడి జాతర - నిత్యం హోలీ ;
;
6. madanuni aidu Sara pushpamula ;
puppoDi jaatara - nityam hOlI ;
=
7. కో కో ఆటలు ఆడే బాలలు ;
నడిమి పరుగులు, వేసే ముగ్గులు ;;
=
7. kO kO ATalu ADE baalalu ;
naDimi parugulu wEsE muggulu ; 

8. చందనగంధం జాబిలి వెన్నెల ;

సేదదీర్చును పుడమిని సతతం ; 
;
9. నా కవితల తోటలోన ; 
విరిసినవి జవ్వని చిరునగవులు ; 
9. naa kawitala tOTalOna ; 
   wirisinawi jawwani cirunagawulu ; 
;
10. తురిమినాను నా కవితల కురులలోన నేను ; 
పరిమళాల పడతి నవ్వు పువ్వులన్నిటినీ నేడు ;

10. turiminaanu naa kawitala kurulalOna nEnu ; 
parimaLAla paDati nawwu puwwulanniTinee nEDu ;
;
11. మూతి ముడిచినది మగువ ;
మొగ్గ అనుకుని, వాలినది తుమ్మెద ;
=
11. muuti muDicinadi maguwa ;
mogga anukuni waalinadi tummeda ; 
;
12. పట్టు కుచ్చు సిరి మాలిక ; 
చెలి, ప్రణయ రాజ్య ఏలిక ; 

12. paTTu kuccu siri maalika ; 

celi, praNaya raajya ఏలిక ;
13. గడుసు మౌనం - వెల్లడించును కబురులెన్నెన్నో ;
మిడిసిపాటులేలనో 'పద - వి'పంచి కింకనూ ;  
=
13. గడుసు మౌనం - వెల్లడించును కబుర్లులెన్నెన్నో ;
miDisipATulElanO pada wipamcikimkanuu ;  
;
14. పద విపంచికి 
పదవి దొరకెను 
కావ్య రాజ్యాల ;
=
14. pada wipamciki ;
padawi dorakenu ;
kaawya raajyaala ;  
;
15. తరుణి భృకుటీ కుటీరమున ;
కుంకుమై మెరయుచుండును దినమణి ;
;
16. వంపుతున్నవి పూవులు ;
వన్నెలెన్నో 'వింతలవగా' ;
;
17. వస్త్రకళలకు వన్నెలు - 
'అద్దకముల వనితలు' ; 
;
18. పద విపంచికి - పదవి 

దొరకెను ; కావ్య రాజ్యాల ; 
;
19. వణికేను వెన్నెల- తొణుకాడగా 
తరుణీ మణి దరహాసాల వెల్లువ ;
=
19. waNikEnu wennela- toNukaaDagaa 

taruNee maNi darahaasaala welluwa ;
;
20.  కలువ కనుల చూపులకు బానిసలైనట్టి ;
ఈ స్వప్నాలది చెప్పలేనంతటి నస ;
;
హైకూ ద్విపాద తేనీలు - 121 - 140 ;
శత ద్విదళాలు ; డిసెంబర్ పోస్ట్ ; శత ద్విదళాలు ; 

హైకూ ద్విపాద తేనీలు - 101 - 120

1. చెలి నవ్వుల లావణ్యం ; 
సిరి నేతల 'వాకిలి తెర' ; 

celi nawwula laawaNyam ; 
siri - nEtala 'waakili tera ;  
;
2. తొణకనీయి ఓ తరుణీ! 
నీ నగవుల లావణ్యం ; 

2. toNakaneeyi O taruNii! 
nee nagawula laawaNyam ; 
;
3. కురుల ముడిని చేరె కలువ ;
తగని కులుకు నేర్చె నిపుడు ;
= kurula muDici cEre kaluwa ;
tagani kuluku nErce nipuDu ;
;
4. పడతి మిసిమి చూపులందు ,
పురుడు పోసుకున్నవి తారాగణములు ; 

4. paDati misimi cuupulamdu ; 
puruడు pOsukunnawi తారాగNamulu ;
;
5. వనితామణి మిసిమి సొగసు ;
కావ్యాలకు పొత్తిళ్ళు ఆయె ;

wanitaamaNi మిసిమి sogasu ;
kaawyaalaku pottiLLu aaye ;
;
6. మబ్బుల ఊరిలో -
   మెరుపుల ప్రవేశం ;

mabbula uurilO; 
merupula prawESam ;
;
7. పిడికిలి ముడిచాను ; 
నాదు మగువ 'వలపు గీతల' సారాంశం ఒలికిపోకుండా ;

7. piDikili muDicaanu ; naadu maguwa walapu 

geetala saaraamSam olikipOkumDA ;
;
8. పికము గళము మాధుర్యం ; 
సంగీతం పసిడి గుడి ;
=
8. pikamu gaLamu maadhuryam ; 

samgeetam pasiDi guDi ; 
;
9. ఎట్లాగ వేగడం, ప్రేమకు ప్రతిరోజూ ;
వినయ విధేయతలే కావాలంట మరి ;

9. ఎట్లాగ wEgaDam, prEmaku pratirOjU ;
winaya widhEyatalE kaawaalamTa mari ; 
;
10. సకల భావాలకు ;
ఒకే బిందువు, 'ప్రేమ భావన' ;

10. sakala bhaawaalaku ;
oకే bimduwu - prEమ భావన ;
;
11. వలంటీరు మన్మధుడే,

అనుక్షణము ప్రణయానికి ; 
;
12. నా మదిని సదా ఉన్న దేవతకు ; 
అర్చకుడిని, దాసానుదాసుడిని ; 

13. అశ్రు ప్రసూన అర్చనలివియే - అతివకు ;
ఒసగుచు అను నిరతమును ఇట్లాగే ;
=
13. aSru prasuuna arcanaliwiyE - atiwaku ;
osagucu anu niratamunu iTlaagE ;

14. మకరంద చిత్రముకు యవనికగ మారింది, 
చిరుగాలి -ఎంత సంబరమో! 
;
15. చిరుగాలి గురువాయె, పుప్పొడికి ;
రంగోలి ఆట అబ్బినది అయ్యారె ;
;
16. తొణకనీయి ఓ తరుణీ! 

నీ నగవుల లావణ్యం ;
;
17. విప్పారిన పింఛమ్ము ;
రతీదేవి చే వీవన* ;  
[ చే వీవన* ;  = చేతిలోని వీవన* ] ; 
=
17. wippaarina pimCammu ;
rateedEwi cE weewana* ;  

[ cE weewana* ;  = cEtilOni weewana* ] ; 
;
18. నెమలి పింఛం పురులు - 

సోయగాలకు 'నగర -'పురులు'
;
19. తరుణి నవ్వుల లావణ్యం
తొణుకుచుండును నిరంతరం ;;
20. కలవె కోమలి కోవెలలో ; 
'కల'వై కలవర లోకములో!? ;

20. kalawe kOmali కోవెలలో ; 

kalawai kalawara lOkamulO ;
;
;
[  హైకూ ద్విపాద తేనీలు - 101 - 120 ;-
శత ద్విదళాలు ; డిసెంబర్ పోస్ట్ ; శత ద్విదళాలు ]
;

హైకూ ద్విపాద తేనీలు - 81 - 100

1.మనసు పుటలకు మకిలి పూయకు, నేస్తం ;
ఇంద్రధనుసులకు ఆలవాలము శ్వేత వర్ణమే తెలుసుకో ;   

మనసు పుటలku makili puuyaku, nEstam ;
imdradhanusulaku aalawaalamu SwEta warNamE telusukO ;  
;
2. బ్రతుకు నింగిపై ఉషాకిరణాలు ;
వెల్లివిరియాలని ఎంతో ఆకాంక్ష ; 

bratuku nimgipai - ushaa kiraNAlu ;
welliwiriyaalani emtO aakaamksha .

3. ఏమనగలను, ప్రేమ నెమలిని ; 
తన పురిని విప్పి చేయు మేల్మి ఆటను మరచిపోతే- 
= 3. Eమనgalanu, prEma nemalini ; 
tana purini wippi cEyu mElmi ATanu maracipOtE-;
;
4. మాలిమి చేసుకున్నవి మేలి ముసుగులు ;
చెలియ మోము సోయగములను భళి  ;

maalimi cEsukunnawi mEli musugulu  ;
celiya mOmu sOyagamulanu bhaLi ;
;
5. తేటి ఆట తేనె పాట ; 
ఋతు మేదిని, మధు ఊట  ;

5. tETi ATa tEne pATa ; 

Rtu mEdini, madhu uuTa ;
;
6. తెలి వెన్నెలలో చక్రబంధము  ;
వరదగుడిలోన రేరాజు చందురుడు 
=
teli wennelalO cakra bamdhamu ;    
waradaguDilOna rEraaju camduruDu ; 

7. స్వేచ్ఛగా విహారం చేయాలని ఆపేక్ష మనిషికి ;

విధ్వంసానికి గురైన ప్రకృతి నవ్వింది విషాదంగా ;
;
8. చెలి నవ్వులకు జాబిలి బాకీ ; 
వెన్నెల వడ్డీ ఇస్తున్నానూ. 
=
8. celi nawwulaku jaabili baakee ; 
wennela waDDee istunnaanuu. 
;
9. జవ్వని నవ్వు - 'మధు మాయ' ;          
నా మది ఆయెను మయూరిగా ; 
=
jawwani నwwu madhu maaya ;          
naa madi aayenu mayuurigaa ; 
;
10. నయనమె సాక్షి ; 
చూపుల ఖైదీ - సఖి సౌందర్యము ; 

nayaname saakshi ; 
cuupula khaidee - sakhi saumdaryamu ;
;
11. అంజనమేది, చీకటి రేయికి ?
వనితామణీ! నీ కంటికాటుక ; 

11. amjanamEdi, ceekaTi rEyiki ?

wanitaamaNii! nee kamTi kATuka ; 
;
12. విప్పారే ప్రణయ భావపద్మాలు ;
కావ్యాల కొలనులకు కలిగించే పూర్ణత్వం ;
= wippaarE praNaya bhaawa padmaalu ;
  kaawyaala kolanulaku sampuurNatwam.
;
13. చుక్కల పంటలు ; 
రేయి పొలం మడి నిండా; 
=
13. rEyi maLLa nimDA ; 
  chukkala pamTalu. 
 ;
14. ఘుమఘుమలెన్నో పూల బాలల ఆస్థి ;
రిమ ఝిమలన్నీ తరుణి నగవుల ఆస్థి.

ghumaghumalennO puuwula aasthi

rima jhimalannii taruNi haa]sammula aasthi ;

;  
15. కంచుకాగడా తూరుపు దిక్కున ;
  ప్రభాత చైతన్యాలకివే ఆహ్వానములు.
=
 kamchukaagaDA tuurupu dikkuna
 prabhaata chaitanyaalakiwE aahwaanamulu.   
;
16. కొండల జలపాత కెరటాల 
  సేదదీరుతు ఉన్నవి ఇంద్రధనుసులు.

16. komDala jalapaata keraTAla 
  sEdadeerutu unnawi imdradhanusulu.
;
17. మెరుపు దండముల తరాజులు ; 
మేఘాలు, బరువుల తూచే సిబ్బిలు ; 

17. mEGAla sibbilu ;  tuustunnadi   taaralanu ; [ ♣♣♣ ] ; 
;
18. లోయలలోన కిరణాలు -
మేలిమి 'సరిగ - పోగుల' అల్లికలు ;
;
19. జరీ సరిగ బుటాలను ;

రాత్రి తివాచీపైన కుట్టినది ఎవ్వరో!?
;
20. అమావాస్య ఇది, వెన్నెల ఎటుల!?
       చెలి నవ్వుల కాంతులవి ;
;
- హైకూ ద్విపాద తేనీలు - 81 - 100 ; 
శత ద్విదళాలు ; డిసెంబర్ పోస్ట్ ; శత ద్విదళాలు ; =
Sata dwidaLAlu ; Disembar pOsT ; 

హైకూ ద్విపాద తేనీలు - 61 - 80

1.  నింగి రేకుల మధ్య ;
ఆణిముత్య మ్ము వంటిదీ భూగోళము ;;
;
2. రామ్ డోలు మోగిస్తూనే ఉన్నవి ;
నీలి నింగిలో మేఘాలు ;
;
3. ముసురు పట్టింది ఆ నింగి ;
మకురు పట్టింది చెలియ మది;
;
4. మంకు తనము, పట్టింపు = 
అది సఖియ మది ; 
;
5. చెలిమి చేసేను చెలి ; 
తన కన్నీటి చెలమలతో!
;
6. 
నవ మల్లిక పరిమళం ;
వనదేవికి హారతి ; 
= 
nawa mallika parimaLam ;
wanadEwiki haarati ; 
;
7. ఆహా! గాలికి ఇపుడు దొరికె జవాబు ; 
చెలియ ముంగురు రింగులనేలే తానే నవాబు ; 
;
8. నాదు కోమలి నగవు ప్రభలందున ; 
ఆది మధ్యాంతాల వెదకుకొను 'ప్రేమ' ;  
;
9. సఖి 'నగవు - ప్రాభవము' ముందు ;
దుందుడుకు సూర్యునిది అణువంతమాత్రమే! 
;
10. లేత నవలాకు తోటలు ;
తరుణి ఎల నగవులు ;
;
11. హరివిల్లుల గిలిగింతలు ;
రంగులకు పులకింతలు ;
;
12. గులాబీల దొంతరలలొ తొందర లేల!?
చెలి హాసము సౌరభాలు ముప్పిరి గొనగా .... ;
=
12. gulaabeela domtaralalo tomdara lEla!?
celi haasamu saurabhaalu muppiri gonagaa  ;
;
13. జాజులు తురిమిన చెలి కురుల ;
తావిగ దూరుట 'గాలి -  రివాజు ; 
=
13. jaajulu turimina celi kurula ;
taawiga duuruTa gaali riwaaju ;
;
14. షరా మామూలే, వలపు గద్దెపై ;
నేనే షరాబు, తానే మహరాణి ; 
;
15. పడమర పడవ నెక్కి ;
'సందె కన్నె' కులుకు చూడు ; 
paDamara paDawa nekki ;
samde kanne kuluku cUDu ;  
;
16. నాదు పాట చరణమ్ములు దోగిసలాడేను ;
రమణి పారాణి చరణముల ముందు ; 
;
17. కెరటాల పైన ఏలనో వెన్నెల
!?
ఆరబోసింది కదా కోమలి - తన నవ్వులన్నీ ;
;
18. స్ఫటిక వలపుకై ఎన్నో ఆరాటములు
ఆ స్వచ్ఛ ఆరాటములతో ఎన్ని పోరాటాలు, 
ఇది ఏమి వింతయో!? 
=
sphaTika walapukai aaraaTamulu ;
aa swacCa aaraaTamulatO -
enni 
pOraaTaalu, 
idi Emi wimtayO!?
;
19. కోమలవల్లీ, నీ నవ్వుల పూవులు ;
గుబాళించనీ, మళ్ళీ మళ్ళీ ;
kOmalawallee, nee nawwula puuwulu ;
gubALimcanee, maLLI maLLI ;
;
20. సిరిమల్లె తావులు ;  
చెలి తేట నవ్వుల ఓలలాడేను ;
;

హైకూ ద్విపాద తేనీలు - 41 - 60

1. వెన్నెల రధ సారధి - ఓ జాబిల్లీ! 
నీకు ధరణిసుస్వాగతమిదిగో! 

1.  wennela radha saaradhi - O jaabillee! 
neeku dharaNi suswaagatamidigO!  
;
2. లావణ్యవతి నగవు పంచన చేరాను ; 
పంచదార చిలకను ఐనాను లెస్సగా!
=
2] laawaNyawati nagawu pamchana chEraanu ; 

pamchadaara chilakanu ainaanu lessagaa! 
;
3. కిక్కిరిసిపోతోంది ఎద పంజరం ; 
బందీలు ఐనట్టి ఊహల పక్షులతొ  ;
;
4. పున్నమి జాబిలి చెల్లించేను భారీ బాకీ ;  
లేమ నవ్వులకు శుల్కంగా-  ;
=
లేమ nawwulaku Sulkam bhaaree baakee - 
cellimcEnu wennelanu - punnami jaabili ; 
;
5. సృష్టి ఘనతకు కొలబద్ద ఏమిటి!?

   కనులను కట్టి పడేసే సౌందర్యాల బంధాలు ;
;
6. ప్రణయానిది పై చేయి ఐతే చప్పట్లు; 
కిందైతే విరహాల కుంపట్ల సెగలు ; 
=
6] praNayaanidi pai chEyi aitE chappaTlu, 
kimdaitE wirahaala kumpaTla segalu ; 
;
7. అనుభవాలు జీవితపాఠ్య  పంక్తులు ;
కాలం బోధించే మంచి పంతులు ;  
anubhawaalu jeewitapaaThya  pamktulu ;

kaalam bOdhimcE mamci pamtulu ; 
;
;
8. పచ్చని వన దేవీ! వందన శత కోటి ;
నీదు సురభిళ నగువుల తేటలకు ;
; = 
8.  paccani wana dEwee! wamdanam ; 
needu surabhiLa naguwala tETalaku ;

;
9. ఎన్నెన్ని సొగసులకు, పోలికలకు ;

పసిడి అక్షయపాత్ర ఈ ప్రకృతి ;
;
10. విశ్రమించె మెరుపులు ; 
మేఘ శయ్యలందున ; 
=
10. wiSramimce merupulu ; 
mEGa Sayyalamduna 

;
12. కనుపాపలకు వందనం ; 
చూపుల నిధులకు గని ఐనందుకు ;
;  
13. పక్వ ఫలం -
తూర్పు దిక్కు పసిడి పళ్ళెంలోన ;  
=
pakwa phalam tuurpu dikku pasiDi 

paLLemlOna ;
;
14. విరబూసిన సంపెంగలు ;
పరిమళాల బరువులతో ..... ;
=
parimaLAla baruwulatO wirabuusina సంపెంగlu 
;
15. నిర్ఘాంతపోయె మన్మధుడు ;

చెలి నీలి కురులలోకి చేరె పంచ పుష్పములు ; 
;
16. పాల పూతల - పుంతల దారుల ; 
వియచ్చర కన్యల హంసల నడకలు - 

paala puutala - pumtala daarula ; 

wiyaccara kanyala hamsala naDakalu ; 
;
18. కనుపాపల నందనముకు ; 
ప్రకృతీ వందనము ; 

kanupaapala namdanamuku ;

prakRtee wamdanamu  ; 
;
19. కెరటాల పైన వెన్నెల ఏలనో!?

ఆరబోసింది కదా కోమలి - తన నవ్వులన్నీ ;
;
20. నవ మల్లిక పరిమళం ;
వనదేవికి హారతి ;;
;
;    -  హైకూ ద్విపాద తేనీలు - 41 - 60 ; 

హైకూ ద్విపాద తేనీలు - 21 - 40

1. నా ఊహల కోవెలలో ;  
సదా ఉవిదయె దేవత ; 
;
2. మేఘరహిత సౌదామినులు ; 
చెలి - హాసిని దరహాసాలు ;  
;
3. నింగిని వెన్నెల సౌష్ఠవ మేల? ;
వచ్చెను జాబిలి నేడు పున్నమిగ ; ;
;
4. మొయిలు పడవలలోన - 
ఈ ఇలకు దిగి రావమ్మా చిన్నారి నెలవంక ; 
;
5. మబ్బుల భరిణలు పసిడి సమానం ; 
అందున అంబువు పదిలం పదిలం ;
;
6. చెట్టు నీడ పావడా - పరచుకుని 
కూర్చున్నది 'నేలబాల' ; 
=
 ceTTu nIDa paawaDA - paracukuni,
 kuurcunnadi nEla baala ;
;
7. గగనం ఖాళీ, చుక్కలెక్కడ? - 
లెక్కిస్తున్నా, జవ్వని జడలో మల్లికలెన్నని? =
=  
gaganam khaaLI, cukkalekkaDa? ; 

lekkistunnaa - jawwani jaDalo mallikalalennani? ; 
;
8.వెన్నెలకు ' ఉపవాసం' -
అమావాస్య రేయి నేడు ; 
=
9. వెన్నెల లేదు - పస్తులు నింగికి!!? ; 
గైకొను మివిగో వనిత నవ్వులు ; 
;
10. మెలమెల్లగ జగతిపైన విస్తరణలు ;
తొలిపొద్దు కిరణగీత లాలనలు ; 
=
mela mellagaa jagatipai wistaraNalu ; 
toli poddu kiraNa  laalanalu ; 
;
11. అమావాస్య రేయి నేడు ; 
వెన్నెల నోములు, ఉపవాసం ; 
=               
11. amaawaasya rEyi nEDu ; 
wennela nOmulu, upawaasam 
;
12. అనుభవాలు జీవిత పాఠ్య పంక్తులు ;
 అధ్యాపకుడు బోధించే కాలమే!   
;
13. తెరలు తెరలుగా దగ్గుతూ మబ్బులు ;
వాన తెరలను దించుతూన్నవి వసుంధరకు  
;  
14. మేఘం సింగారం ;
  మెరుపు పాపిట బిళ్ళ తళతళా ;
;
15. మాలతి మాధవాలు ; 
వాలుగాను ఊగుతూన్న పూలతీగ జుంకీలు ;
;
16. మబ్బులకేమో తటపటాయింపు ; 
మెరుపుల కీలాగ చిటపటలు ; 
;
17. భావముల వలయాలకు "అక్షము" - 
అక్షరమే, అక్షరాలా, ప్రియనేస్తం! 
;
18. వన్నెల సీతా కోకలు ; 
తోటల, తోపుల మృదు ప్రబంధములు ; 
;
19. తోటలో మల్లిక, తోపులో మావి పూత 
తేట తెనుగు తావి - మాట గుబాళింపు ;
;
20. ద్వీపం నడుమన ఉన్నది కోవెల ;  
చుట్టూ వలయం - నది వడ్డాణం ;  
;
 - హైకూ ద్విపాద తేనీలు - 21 -  40  ;
;

హైకూ ద్విపాద తేనీలు - 1 - 20

1. పసుపు కొమ్ము, శొంఠి కొమ్ము; వస్తువులకే ఉన్నప్పుడు, 
మనుషుల్లో కొందరికి కొమ్ములు ఉంటే విడ్డూరమేమున్నది!?
;
2. వర్ష ఋతువు ఆగమనం ; 
శుష్క గ్రీష్మ నిర్గమనం ; 
;
3. గగనం దింపిన నక్షత్ర పల్లకి ;
శోభలీనెడు మగువ సిరి నగవు ;

gaganam dimpina nakshatra pallaki ;
SOBaleenu maguwa nagawu/ wwu ;
;
4. నీదు వీక్షణముల వాహినిలో ; 
క్షణములు అన్నీ  'గజఈత' నేర్చిన మీనులు ;
= = needu weekshaNamula waahinilO ; 
kshaNamulu eeta nErcinameenulu
;
5. నీలవేణి వంకుల కురులలోన ;
చిరుగాలికి చక్కనైన చక్రబంధమే!;
5. neelawENi wamkula kurulalOna ;
cirugaaliki cakkanina cakrabamdhamE! 

;
6. వర్ష ఋతువు నిండు పేరోలగం ; 
కోటి చినుకుల సభికులు ; 
= warsha Rtuwu నిండు pErOlagam ; 
kOTi cinukula sabhikulu ; 21 june17 
;
7. చినుకుల లకుముకి పిట్టలు ; 
వాలెను పృధ్వీ వృక్షమున - ; 
= చినుకుల lakumuki piTTalu ; 
waalenu pRdhwee wRkshamu payina; 
;
8. మల్లెల విరి చేవ్రాళ్ళు 'ఆన' ;

మదిని విరిచెను తన నిర్లక్ష్యం ; 
;
9. సర్వాంగ సుందరం ప్రకృతి మందిరం ; 
ఇందిందు చేరేను ఇంతి దరహాసం ; 
;
10. చినుకుల పక్షులు వాలుతున్నవి ;
 చెలమల వలయపు చిత్రణలు ;  
;
11. మేఘ ధృతి రాగం ; 
వర్ష ఉధృతి సంగీతం ;
;=
mEGa dhRti raagam ;
warsha udhRti samgeetam - 
;
;
12. విహంగముల హంగామా ;
    మబ్బు చినుకు ఖజానా ; 
;
13. మాధవ 'తిలకం' - 
          మాలతి పువ్వు ;  
;
;
14. విహంగముల హంగామా ;
    మబ్బు చినుకు ఖజానా ; 
;
15. మాధవ 'తిలకం' - 

      మాలతి పువ్వు ;  
;
16. దండోరా వేస్తూన్నవి మబ్బులు ; 
ఇంక - వర్ష ఋతువు వచ్చేసిందోహో!' అంటూ ; 
;;
17. కురవండోయీ నీలి మబ్బులూ! ; 
పరుగుకు ముందే ఆయాసమా? భళీ!
;
18. నా ఊహల కోవెలలో ; 

దేవత ఉవిదయె సదా సదా ; 
;
19. మేఘరహిత సౌదామినులు ; 
హాసిని దరహాసాలు ;   
;
2o. ఉల్కా పుష్పం తళుక్కున జారెను ;  

ఉలుకు ఎక్కువే, ఏ ఒడి చేరెనో!?
;

Monday, May 22, 2017

దివ్యమైన శైలూషిక

నవ మల్లిక ; 
తుల తూచింది పరిమళాలను  ; 
వన మయూరికా ; 
నాట్యము లిలపై వెలసెను ఓహోహొహో! -   ||
;
ఇదే కదా ఆహ్లాద వేదిక ; 
నందన బృందావనము ;
నవ  నందన బృందావనము ;  ||  
;
సౌదామిని త్రుళ్ళింతల జారే దివ్యమైన శైలూషిక ; 
ఏమని చెప్పను - నా ప్రతి నుడువు ; 
సంభ్రమోద్వేల ఘన వర కిన్నెర ;   || 
;
సకలకలర్స్1 [ 2017 ]

Sunday, March 12, 2017

సామెతలే పేర్లు ఐన Telugu Films

సామెతలే పేర్లుగా ఉన్న తెలుగు చలనచిత్రాలు ;  
కొన్ని ఉన్నవి, గుర్తుచేసుకుందామా!?
కలసి ఉంటే కలదు సుఖం ; 
కలసి వచ్చిన అదృష్టం ;/ కలిసొచ్చిన అదృష్టం ;
కలవారి కోడలు ; భాగ్యచక్రం ; 
దైవ బలం ; సంకల్ప బలం ;
దేవుడు చేసిన మనుషులు ;  
దేవుడు చేసిన బొమ్మలు ; [ 1976 ] ;
ఆట బొమ్మలు ;
కీలుబొమ్మలు ;
దేవుడిచ్చిన భర్త ;;;  దేవుడిచ్చిన భార్య ;
నిత్య కళ్యాణం పచ్చ తోరణం ;
పెళ్ళి చేసి చూడు ; 
శతమానం భవతి ;
అమ్మలక్కలు ; 
పొరుగింటి పుల్లకూర ;
చెరపకురా  చెడేవు ;
అప్పు చేసి పప్పు కూడు ;
లోగుట్టు పెరుమాళ్ళ కెరుక ;
గొప్పవారి గోత్రాలు ;
సంసారం ఒక చదరంగం  ;
ఇల్లు - ఇల్లాలు ; 
ఇంటికి దీపం ఇల్లాలే ;
బొమ్మరిల్లు ;
బొమ్మల కొలువు ;
;
సొమ్మొకడిది సోకొకడిది ;
డబ్బుకు లోకం దాసోహం ;
డబ్బెవరికి చేదు, 
ఆకాశరామన్న ; 
నడమంత్రపు సిరి ;
కోరికలే గుర్రాలైతే ;
ఎవరికి వారే యమునా తీరే  ;
అమ్మ లేని పుట్టిల్లు ;
పుట్టినిల్లా మెట్టినిల్లా ; 
ఇంటి గుట్టు ;
నూరేళ్ళ పంట ; చల్లని నీడ ; 
కోటి కొక్కడు ; 
అతనికంటె ఘనుడు  ; 
ఆజన్మ బ్రహ్మచారి ;
నవ్వితే నవరత్నాలు ;
మట్టిలో మాణిక్యం ; 
ఇంటింటి రామాయణం ;
రాంబంటు ; 
ఆలస్యం అమృతం విషం ;
పంతాలు పట్టింపులు ;
ఎత్తుకు పై ఎత్తు ;
మూడు ముక్కలాట ;  
రేచుక్క ;;; రేచుక్క పగటి చుక్క ;;; 
తోడు దొంగలు ;;;; దొంగకోళ్ళు ;;;
తోడూ నీడా ;
మంచి మనసుకు మంచి రోజులు ;
ఆత్మ బంధువు ; 
మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు ;
ఇద్దరూ ఇద్దరే ;
అందరూ అందరే ;
అంతా మన మంచికే ;
కుక్క కాటుకు చెప్పు దెబ్బ ;
పెళ్ళంటే నూరేళ్ళ పంట ;
జీవితమే ఒక నాటకం ...; 
ఇదెక్కడి న్యాయం?
సుఖదుఖాలు ; 
వెలుగు నీడలు ;
చీకటి వెలుగులు ;
బొట్టూ కాటుక ; 
చిటికెలపందిరి [ ప్రభ, చంద్రమోహన్ 1993 ] ; 
పాలు -నీళ్ళు 
(పాలు నీళ్ళలా కలిసిపోయారు అంటారు వాడుకలో )
వీర కంకణం ;

జగన్నాథ రధ చక్రాలు ; 
లేత మనసులు ; పాల మనసులు [ పాల బుగ్గలు ];

Wednesday, March 8, 2017

చైత్రం to ఫాల్గుణ, film names

"శ్రావణ" & "మాఘ" మాసము - words తో 
వచ్చిన సినిమాల పేర్లు, సినీ పాటలు ????? :- 
సినిమా పేరు కూడా స్పష్టంగా ఇస్తే - 
confusion కి ఆస్కారం ఉండదు. ;
చైత్రం, వైశాఖం, జ్యేష్ట, ఆషాఢ,
శ్రావణ ; భాద్రపద ; ఆశ్వీజ, కార్తీక ;
మార్గశిర, పుష్య, మాఘ,ఫాల్గుణ మాసములు ; 
;
ఇవి చాంద్రమానము ప్రకారము వస్తున్న నెలల పేర్లు.
ఈ నెలల పేర్లు ఉన్న సినీ గీతాలు, & సినిమాల పేర్లు ఉన్నవి కదా!
ప్రస్తుతం - శ్రావణ, మాఘ మాస పదములతో వచ్చిన 
మన చలన చిత్రములను చెప్తారా!? ;
;
] ఇది ఆమని సాగే చైత్ర రధం ;
  ఇది రుక్మిణి ఎక్కిన పూల రధం ;
  మనో వేగమున ; మరో లోకమున ; 

  పరుగులు తీసే మనో రధం ; 
        [ జేగంటలు , ముచ్చర్ల అరుణ ] ;  
] పెళ్ళిళ్ళకు మధుమాసం 
          చైత్ర మాసం...ఓ సీత కథ
] జూనియర్, జూనియర్, జూనియర్ ;
అటూ ఇటూ కాని హృదయం తోటి ... 
ఇది కథ కాదు ;-  కమల హాసన్, జయసుధ ;
చైత్రము లోన చినుకు పడాలని కోరేవు ; 
మార్గశిరాన మండుటెండకై చూసేవు
] ఈ చైత్ర వీణ ; ఝుమ్ ఝుమ్మనీ ;  = [ ప్రేమించు పెళ్ళాడు - film ]
  = ii caitra weeNa ; jhumm jhummanee ;; 
 Ee chaithra veenaa jhum jhummanee [ prEmimcu peLLADu - 
] చైత్ర కోయిల లెన్నో మైత్రి వేణువు లూదే...
]   స్వాతి ముత్యపు జల్లులలో ; 
    శ్రావణ మేఘపు జావళి లో -- ప్రేమ యుద్ధం 2;
;
;] వచ్చే వచ్చే వైశాఖంలో ; 
పల్లకీ, ఈ పిల్లకి ; 
తెచ్చే తెచ్చే ;  [ మేడమ్ ] 
] వైశాఖ సంధె నిన్ [ మలయాళ పాట ] =   
 vaishaka sandhye nin chundil ........ ;  
-  film nadody katte ;

**********************;

] ఆషాఢం పెళ్ళి కొడుకు [ movie ] ;
;
] పాపాయి నవ్వాలి ;
   పండగే రావాలి  .........  ఈ పాటలో 
ఆషాఢం, శ్రావణం రెండూ వస్తాయి  .......... ; 
 film 'మనుషులు మారాలి' 
- శోభన్ బాబు, శారద - hit pair గా నిలిచినది
] ఆకాశ దేశాన ఆషాడ మాసానా 
         మెరిసేటి ఓ మేఘమా ! [ మేఘ సందేశం ]
] యుద్ధభూమి ; ఆషాఢమాసం ......... ;  [ మలయాళ పాట ] 1976 ; 
;
@@@@@@

] శ్రావణ సంధ్య ;
] మాఘ మాసం ఎప్పుడొస్తుందో ; 
] శ్రావణ మంగళ వారం ;
చల్లని సాయంకాలం ;
లగ్గం చూసుకు వస్తా ;
వస్తా వెళ్ళొస్తా ;
ఎప్పుడు , ఎప్పుడు?..... 
[ song from film ;- సిసింద్రీ చిట్టిబాబు ] ;- 
=============;
శ్రావణ mamgaLa waaram ;
callani saayamkaalam ;
laggam cuusuku wastaa ;
wastaa weLLostaa ;
eppuDu , eppuDu?......
;
************************:

] కార్తీక పున్నమి లో.... పోలీస్ భార్య ;
] వస్తాడు నా రాజు, ఈ రోజు ; 
  కార్తీక పున్నమి వేళలోన ;
   కలికి ..........  ; [ అల్లూరి సీతారామరాజు ]  =
wastaaDu naa raaju, ee rOju ; 
kaarteeka punnami wELalOna ;
kaliki ..........  ; [ alluuri seetaaraamaraaju ]
] నవమి నాటి జాబిలి నీవు ; ... 
  కలుసుకున్న ప్రతి రేయీ; 
  కార్తీక పున్నమి రాత్రి   =
nawami nATi jaabili neewu ; ... kalusukunna prati rEyii;

kaarteeka punnami rAtri ;
;
] సినిమాల పేర్లు ;-
  కార్తీక దీపం ; కార్తీక పౌర్ణమి ;   శ్రావణ శుక్రవారం ;
] మాయదారి సిన్నోడు.....సాంగ్ లో మాఘమాసం వస్తుంది
] మాఘమాసం మంగళవారం, మామయ్యొస్తాడు ;
ఫాల్గుణమాసం, సుక్కర వారం బాగుందన్నాడు ; ముహూర్తం బాగుందన్నాడు ;
[ సుక్కర వారం = శుక్రవారం  [ మా దైవం 1976 ; జయచిత్ర ; ] ;
;
పల్లె పడతి లల్లాయి పల్లాయి పాట ; 
శాంతారామ్ తీసిన "దో ఆంఖే బారా హాత్" ఆధారం.
'మా దైవం' 1976 ;- జయచిత్ర, NTR film ;
**************************************;
] పుష్యమి పూవుల పూజ చేస్తా ..... ; 
] ఈ తూరుపు ఆ పశ్చిమం ; పడమటి సంధ్యారాగంలో 

***************************************; 
అది ప్రశ్న - ఇది జవాబు ;
- రాగ రాగిణి [ kusuma - pen name ]
సరదా పజిల్స్ Qns cinema, film quiz, చలన చిత్రాలు, 

Tuesday, March 7, 2017

బాబాయ్ హోటల్ ఫలహారాలు

'బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం;
ఫలహారాలే తింటే పరమానందం  ............  '
This is a song , from  
[ Babai Hotel Songs ] -
Baabai Hotel - Brahmanandam, Kinnera ;
&
ఒక హోటల్ వలన, ఇడ్లీకి పేరు వచ్చింది,
హోటల్ కీ ఇడ్లీకీ అవినాభావ సంబంధం ఉండటం విచిత్రమే! 
ఇడ్లీతో కలిపి జంటగా కలిగినది- 
అదే బాబాయ్ హోటల్ ;
బాబాయ్ హోటల్ :- బాబాయ్ హోటల్ అనగానే గుర్తువస్తాయి ; 
బాబాయ్ హోటల్ ఇడ్లీ అంత ప్రసిద్ధి. 
"బాబాయ్ హోటల్- ఇడ్లీ", పెసరట్టు, ఉప్మా.
వెన్న రాసి, కారప్పొడి వేసి - ఇప్పటికీ ఇస్తూ ,
అదే స్టాండర్డ్ ని maintain చేస్తున్నారు. 
"బాబాయ్ హోటల్" అనే పేరుతో సినిమా వచ్చింది.
బ్రహ్మానందం హీరో. ;
& విజయవాడలోని - బాబాయ్ హోటల్ వలన 
ఏకంగా సినిమాకు అదే నామకరణం ఇవ్వడం - 
ఒక record కదూ! 
;
Phone, +91 81216 51716 · 
Address. NRP Road, 
Gandhi Nagar; 

Vijayawada, India 520003. 

&
;  కీ. శే. పాత్రుని సాంబమూర్తి గారు నెలకొల్పిన 
ఈ Hotel - వలివేటి లక్ష్మీ నరసింహారావు [ చంటి] నిర్వహణలో 
ఉన్నత విలువల స్థాయిలో జరుగుతూ,
నేడు కొనసాగుతున్నది.

- ;- FB ;-  Essay ;- రవీంద్రనాథ్ ;- 98491 31029 ;
& శాకాహార భోజన శాల ; 
Labels ;- అభి'రుచి', సరదా పజిల్స్ Qns cinema, film quiz, చలన చిత్రాలు, 

Thursday, February 16, 2017

నిత్యకల్యాణం పచ్చతోరణం , film names

'కళ్యాణం',  ' పరిణయ',  'వివాహ , 'పెళ్ళి',' - 
ఈ 4 పదాలు - కలిగిన 
సినిమా పేర్లు చెబుతారా!? 
1] కళ్యాణం ;-
శ్రీ వేంకటేశ్వర కల్యాణం ; నిత్యకల్యాణం పచ్చతోరణం ;  
శ్రీనివాస కళ్యాణం ; 
సీతారామ కళ్యాణం ; సీతా కళ్యాణం ; 
రుక్మిణీ కళ్యాణం [ 1937 శాంత కుమారి ];
రుక్మిణీ కళ్యాణం [ 1989 భాగ్యరాజా, ఐశ్వర్య ];
సీతా రాముల కళ్యాణం, లంకలో [ నితిన్, హన్సిక 2010 ]
రాధా కళ్యాణం ; రాజేశ్వరీ కల్యాణం ; 
కల్యాణ వైభోగమే ; 
కల్యాణ తాంబూలం ;[ 1986 ; dir ;- బాపు ];
కళ్యాణమండపం [ కాంచన, శోభన్ బాబు ] ;
కల్యాణ వీణ ; కల్యాణ రాముడు ;
ఆహా కళ్యాణం [ నానీ ] ;

2]  పరిణయం ;-
    శశిరేఖా పరిణయం ; ఉషా పరిణయం ;

3]  వివాహ , వివాహం  ;-
   వివాహ బంధం ;
   విచిత్ర వివాహం ;
   వివాహ భోజనంబు ; [రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ , అశ్విని ] ;

4]  పెళ్ళి ;-
A]  పెళ్లీడు పిల్లలు ; పెళ్ళి సంబంధం ;;
       పెళ్లి చూపులు ; పెళ్ళి ;

B] దేవుడు చేసిన పెళ్ళి ; ప్రేమ చేసిన పెళ్ళి ; 
పెళ్లి చేసి చూడు  [రాజేంద్ర ప్రసాద్,  అశ్విని ]  ; 
పెళ్ళి చేసి చూపిస్తాం ;
ప్రేమించి పెళ్లి చేసుకో ; 
ప్రేమించు పెళ్ళాడు [ 1985 రాజేంద్ర ప్రసాద్, భానుప్రియ ]
మంగళ తోరణాలు ; ఈడు పెళ్ళంటోంది --  ; 
పెళ్లి మీకు,అక్షింతలు మాకు ; 
మళ్ళీ పెళ్లి ; పెళ్లి మీద పెళ్లి ; పెళ్లి గోల ;
అహ నా పెళ్ళంట ; ఓహో నా పెళ్ళంట ;
పెళ్లంటే నూరేళ్ళ పంట ;
పల్లకిలో పెళ్లి కూతురు ; అమ్మాయి పెళ్లి ; రాధమ్మ పెళ్లి ;

C] పెళ్ళి పందిరి [ జగపతిబాబు ]  ; పెళ్ళిరోజు ; పెళ్ళి పీటలు ; 
పెళ్లికూతురు ; కొత్త పెళ్లికూతురు ; పెళ్ళికొడుకు [ సునీల్ ]  ; 
పెళ్ళి నాటి ప్రమాణాలు ; బొమ్మల పెళ్లి ; 
ప్రేమలు పెళ్ళిళ్ళు ; జాబిలమ్మ పెళ్ళి ; సీతమ్మ పెళ్లి ;
పెళ్లి కానుక ;  పెళ్లి పుస్తకం ;
pellikani pillalu ( పెళ్లికాని పిల్లలు ] ;
పెళ్లి సందడి ; పెళ్లి తాంబూలం ; 
&
పెళ్ళయిన క్రొత్తలో ; 
మా నాన్నకు పెళ్లి ; 
నీకు నాకు పెళ్ళంట ; వద్దంటే పెళ్ళి ;
నిన్నే పెళ్ళాడుతా ;
;
దొంగపెళ్లి ; పిచ్చోడి పెళ్ళి ;