Saturday, December 16, 2017

హైకూ ద్విపాద తేనీలు - 61 - 80

1.  నింగి రేకుల మధ్య ;
ఆణిముత్య మ్ము వంటిదీ భూగోళము ;;
;
2. రామ్ డోలు మోగిస్తూనే ఉన్నవి ;
నీలి నింగిలో మేఘాలు ;
;
3. ముసురు పట్టింది ఆ నింగి ;
మకురు పట్టింది చెలియ మది;
;
4. మంకు తనము, పట్టింపు = 
అది సఖియ మది ; 
;
5. చెలిమి చేసేను చెలి ; 
తన కన్నీటి చెలమలతో!
;
6. 
నవ మల్లిక పరిమళం ;
వనదేవికి హారతి ; 
= 
nawa mallika parimaLam ;
wanadEwiki haarati ; 
;
7. ఆహా! గాలికి ఇపుడు దొరికె జవాబు ; 
చెలియ ముంగురు రింగులనేలే తానే నవాబు ; 
;
8. నాదు కోమలి నగవు ప్రభలందున ; 
ఆది మధ్యాంతాల వెదకుకొను 'ప్రేమ' ;  
;
9. సఖి 'నగవు - ప్రాభవము' ముందు ;
దుందుడుకు సూర్యునిది అణువంతమాత్రమే! 
;
10. లేత నవలాకు తోటలు ;
తరుణి ఎల నగవులు ;
;
11. హరివిల్లుల గిలిగింతలు ;
రంగులకు పులకింతలు ;
;
12. గులాబీల దొంతరలలొ తొందర లేల!?
చెలి హాసము సౌరభాలు ముప్పిరి గొనగా .... ;
=
12. gulaabeela domtaralalo tomdara lEla!?
celi haasamu saurabhaalu muppiri gonagaa  ;
;
13. జాజులు తురిమిన చెలి కురుల ;
తావిగ దూరుట 'గాలి -  రివాజు ; 
=
13. jaajulu turimina celi kurula ;
taawiga duuruTa gaali riwaaju ;
;
14. షరా మామూలే, వలపు గద్దెపై ;
నేనే షరాబు, తానే మహరాణి ; 
;
15. పడమర పడవ నెక్కి ;
'సందె కన్నె' కులుకు చూడు ; 
paDamara paDawa nekki ;
samde kanne kuluku cUDu ;  
;
16. నాదు పాట చరణమ్ములు దోగిసలాడేను ;
రమణి పారాణి చరణముల ముందు ; 
;
17. కెరటాల పైన ఏలనో వెన్నెల
!?
ఆరబోసింది కదా కోమలి - తన నవ్వులన్నీ ;
;
18. స్ఫటిక వలపుకై ఎన్నో ఆరాటములు
ఆ స్వచ్ఛ ఆరాటములతో ఎన్ని పోరాటాలు, 
ఇది ఏమి వింతయో!? 
=
sphaTika walapukai aaraaTamulu ;
aa swacCa aaraaTamulatO -
enni 
pOraaTaalu, 
idi Emi wimtayO!?
;
19. కోమలవల్లీ, నీ నవ్వుల పూవులు ;
గుబాళించనీ, మళ్ళీ మళ్ళీ ;
kOmalawallee, nee nawwula puuwulu ;
gubALimcanee, maLLI maLLI ;
;
20. సిరిమల్లె తావులు ;  
చెలి తేట నవ్వుల ఓలలాడేను ;
;

No comments:

Post a Comment