Showing posts with label అభి'రుచి'. Show all posts
Showing posts with label అభి'రుచి'. Show all posts

Tuesday, March 7, 2017

బాబాయ్ హోటల్ ఫలహారాలు

'బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం;
ఫలహారాలే తింటే పరమానందం  ............  '
This is a song , from  
[ Babai Hotel Songs ] -
Baabai Hotel - Brahmanandam, Kinnera ;
&
ఒక హోటల్ వలన, ఇడ్లీకి పేరు వచ్చింది,
హోటల్ కీ ఇడ్లీకీ అవినాభావ సంబంధం ఉండటం విచిత్రమే! 
ఇడ్లీతో కలిపి జంటగా కలిగినది- 
అదే బాబాయ్ హోటల్ ;
బాబాయ్ హోటల్ :- బాబాయ్ హోటల్ అనగానే గుర్తువస్తాయి ; 
బాబాయ్ హోటల్ ఇడ్లీ అంత ప్రసిద్ధి. 
"బాబాయ్ హోటల్- ఇడ్లీ", పెసరట్టు, ఉప్మా.
వెన్న రాసి, కారప్పొడి వేసి - ఇప్పటికీ ఇస్తూ ,
అదే స్టాండర్డ్ ని maintain చేస్తున్నారు. 
"బాబాయ్ హోటల్" అనే పేరుతో సినిమా వచ్చింది.
బ్రహ్మానందం హీరో. ;
& విజయవాడలోని - బాబాయ్ హోటల్ వలన 
ఏకంగా సినిమాకు అదే నామకరణం ఇవ్వడం - 
ఒక record కదూ! 
;
Phone, +91 81216 51716 · 
Address. NRP Road, 
Gandhi Nagar; 

Vijayawada, India 520003. 

&
;  కీ. శే. పాత్రుని సాంబమూర్తి గారు నెలకొల్పిన 
ఈ Hotel - వలివేటి లక్ష్మీ నరసింహారావు [ చంటి] నిర్వహణలో 
ఉన్నత విలువల స్థాయిలో జరుగుతూ,
నేడు కొనసాగుతున్నది.

- ;- FB ;-  Essay ;- రవీంద్రనాథ్ ;- 98491 31029 ;
& శాకాహార భోజన శాల ; 
Labels ;- అభి'రుచి', సరదా పజిల్స్ Qns cinema, film quiz, చలన చిత్రాలు, 

Tuesday, April 15, 2014

సరసపరిల్లా/ నన్నారీ కూల్ డ్రింకు

1) నన్నారి పానీయము ,

నన్నారి తయారీకి అవసరమైన పదార్ధములు:-
1/4 1/4 కప్ నన్నారి సిరప్: 1 నిమ్మకాయ(రసము): చిటికెడు (ఒక
పించ్) ఉప్పు; 2 గ్లాసుల నీళ్ళు: ఐస్ క్యూబ్ లు; చక్కెర -
అవసరమైనంత;
నన్నారి తీయదనము కలది, అందుచేత- చక్కెర -
నన్నారి సిరప్ కు ఆట్టే అవసరపడదు. స్వీటును ఎక్కువ తినేవారు
సుగర్ ను కావలసినంత మేరకు వేసుకోవచ్చును.
నన్నారి షర్బత్, నిమ్మ సోడా- లను మిక్స్ చేసి, తాగవచ్చును.

*********************************************,

2) నన్హారీ డ్రింకు :-

కొంచెం మార్పులతో- ఇలా కూడా రెడీ ఔతుంది.
ఇలాగ చేసుకోవడానికి 5 నిముషాలు పడ్తుంది.
ఇద్దరికి సరిపోయే లాగ- ఈ కింది కొలతలను తీసుకోవచ్చును.

5 టేబుల్ స్పూన్ ; నన్నారి సిరుప్(చిక్కటి ద్రవము);
 2 పెద్ద చెంచాలు: లై జ్యూసు(= నిమ్మ రసము); అదనపు రుచికై- సోడా;
తురిమిన ఐసు క్యూబులు
అతిథులకు ఇచ్చేటప్పుడు కొన్ని లెమన్ స్లైసులతో గార్నిష్ చేయండి.
ఇంకా కాస్త ఓపిక చేసుకుంటే- క్యారట్, బీట్ రూటుల తురుము లతో- అలంకరించండి.

                   *********************************************,

మరో రకంగా రెడీ! :-
ఎక్కువ తియ్యని (స్వీట్)డ్రింకు గా ఇష్టపడేవాళ్ళు-
ఇలాగ చేసుకుంటారు
సరసపరిలా రూట్స్ ను, బెల్లము/ 'జాగ్ రీ'తో కూడా,
తీయని పానీయమును చేసుకుంటారు.  
బెల్లముతో కొంచెము ఇగిరేలా, బాగా దిగ కాచి, చేసుకునే పద్ధతి ఇది.
ఇది తేలికపాటి పద్ధతి.

                         *********************************************,
                   
సర్ససపరిల్లా- మొక్కకు, ఆయుర్వేదములో(Sarasaparilla)  ప్రత్యేకత ఉన్నది.
దీనినే నన్నారి - అని తమిళ, మలయాళ భాషలలో ప్రాంతాలలో వ్యవహరిస్తూన్నారు.
రాయలసీమ, దక్షిణ సీమలలో నన్నారి షర్బత్తు-ను ముఖ్యముగా
ఎండాకాలములో (Nannari Sherbet) ప్రజలు ఇష్టంగా తాగుతారు.
సంస్కృతంలో ఈ మూలికకు "అనంత మూలము" అని పేరు. మాగర్భు అని కూడా సంస్కృత నామం. తెలుగులో సుగంధిపాల- అని వేసంగిలో కృష్ణాజిల్లా, గుంటూరు జిల్లా కొన్ని ప్రాంతాలలో స్థానికులు ఇష్టంగా తాగే పానీయం ఇది.
కేరళ, తమిళ నాడు, దక్షిణాది రాష్ట్రాలలో ఇలాంటి ఆయుర్వేద వన మూలికలతో వండి, చేసే
పానీయాలకు డిమాండ్ ఉన్నది.కేరళలో "నారునీండి"/ "నన్నారి వల్లి, చేడి" అనీ పిలుస్తారు.
కాపూరి అని తమిళులు చెబుతారు. నన్నారీ అని ఇంగ్లీషు పదం. అధిక ప్రాంతాలలలో ఈ అద్భుత మూలిక"నన్నారి - అని ప్రాచుర్యం గాంచిది. अनंतमूल, #sugandha pala in Telugu; sugankha palada gidda/ sogaDe;  # సరసపరిల్లా- గా ఆయుర్వేద పానీయము ప్రసిద్ధమైనది.

సుగంధి పానీయము, కస్ కస్/ వట్టి వేళ్ళ డ్రింకు మొదలైనవి మన
ఆంధ్రప్రదేశ్ లోని తక్కిన జిల్లాలలో కూల్ డ్రింకులతో సమానముగా వాడుకలో ఉన్నవి.                                                  
నన్నారి పానీయమును సమ్మర్ సీజన్ లో రోడ్ ల పక్కన బండిలలో
విరివిగా విక్రయిస్తారు. నన్నారి చెట్టు వేళ్ళు చాలా ప్రయోజనకారులు,
గ్రీష్మ, శిశిర ఋతువులలో సంభవించే నీరసము, వడపెట్టు, ఇతర రుగ్మతలు రాకుండా కాపాడుతాయి.
అంతే కాకుండా కిడ్నీలలో రాళ్ళు ఏర్పడనీయని
ప్రివెంట్ గా ఆరోగ్యానికి కవచములాగా పనిచేస్తుంది.
టాన్సిల్స్, మూత్రాశయ రాళ్ళు, ఎసిడిటీ మున్నగు జీర్ణకోశ వ్యాధులను
అడ్డుకునే సామర్ధ్యము గల మూలిక ఇది.
నన్నారి సిరప్ ఇండియాలో విరివిగా దొరుకుతుంది.
సులభంగా చేసుకోగలది నన్నారి డ్రింకు.    

                                ******************,
అజీర్తి, కడుపులో వికారము, పులి త్రేన్పులు- వగైరాలను నిరోధించే అమూల్య మూలిక ఇది.
అలాగే చర్మ సంబంధ వ్యాధులు, రుమాటిస్మ్ (rheumatism)లను నిరోధించగలిగినది.
ఆయుర్వేద, యునానీ వైద్యములలో- సరసపరిల్లా- అని ప్రసిద్ధి కెక్కినది.  
వన మూలికలు అమ్ముతూ ఉండే హెర్బల్ ఫార్మసీ (herbal pharmacies)- లలో
ఇది "సరసపరిల్లా" అనే  పేరుతో దొరుకుతుంది.
                                   ******************,
ఒక రెండు బాటిల్ లలో సరసపరిల్లాను నింపి, నిల్వ చేసుకుని,
కావలసినప్పుడు "రస్నా"- వలె, మిక్స్ చేసి, తయారించుకో గలుగుతారు.
కొన్ని క్షణాలలో సునాయాసంగా చేసేయగల సిరప్ షర్బత్తు ఇది.
ఈ ద్రావణమును ఆబాలగోపాలమూ ఇష్టంగా ఆస్వాదిస్తారు.
నన్నారీ కూల్ డ్రింకును అన్ని ఋతువులలోనూ ఎంజాయ్ చేస్తూ, సిప్ చేసే soft drink.
నన్నారీ తీపి పానీయాన్ని అందరూ ప్రీతితో తాగుతూంటారు.
"కదిరి" మున్నగు ప్రసిద్ధ దేవళాలను సందర్శించేందుకు వెళ్తూ,
అక్కడి బాటపక్కన ఉండే బండ్ల మీద  అమ్ముతూండే ఈ నన్నారీ డ్రింకుని కాస్త తాగండి.
                                ******************,
సోగడె బేరిన షర్బత్తు:- కన్నడ భాషలో పేరు ఇది.
Hemidesmus Indika-  అనే జాతికి చెందిన మొక్క.
/ సరివ అర్క- కషాయంగా కూడా చేసుకొనవచ్చును.
sODiyam bemjaiT  ; సోడియం బెంజైట్  , ఏలకులు, పాలు, ఇత్యాదులను తమ తమ అభిరుచిని బట్టి కలుపుకోవచ్చును.
రోజుకు రెండుసార్లు తాగితే, వేసంగి రుగ్మతలకు చిట్కా ఔషధంగా అమరుతుంది.