Sunday, November 25, 2018

హైకూ ద్విపాద తేనీలు - 141 - 160

1. వర్ష ఋతువు దస్తూరి కోసమై వేచి ఉన్నది ;
మాదిరి ప్రశ్న పత్రం - 'మబ్బు తునక' ;
=
warsha Rtuwu dastuuri kOsamai wEci unnadi ;
maadiri praSna patram - 'mabbu tunaka ;
;
2. కొమ్మ కొసలోన పువ్వులు నవ్వాయి ;
మందార కొమ్మకు గోరింట పండింది ;
=
komma kosalOna puwwulu nawwaayi ;

mamdaara kommaku gOrimTa pamDimdi ;
;
3. కుడ్యాల మూలలో ఎంబ్రాయిడరీలు ;
సాలీడు నేసిన చక్కని గూళ్ళు అవి ; 
=
kuDyaala muulalO embraayiDareelu ;
saaleeDu nEsina cakkani guuLLu awi ; 
;
4. పట్టు పట్టిన నా మదిలోని పాటలు ;
చేరినవి ఇంచక్క - శారదా వీణియను ;
=
paTTu paTTina naa madilOni pATalu ;
cErinawi imcakka - SAradaa weeNiyanu ; 
;
5. పట్టు కుచ్చు జడకుచ్చులు ;
సంక్రాంతికి పట్టిన జయ కేతనాలు ;
=
paTTu kuccu jaDakucculu ;
samkraamtiki paTTina jaya kEtanaalu ;
;
6. పటుకు పటుకు పటిక బెల్లం ; 
నేటి పిల్లలు మరచిన -
- మధు తినుబండారం ;

paTuku paTuku paTika bellam ; 
nETi pillalu maracina -
- madhu tinubamDAram ;
;
7. పిట్టల కువకువ, కిచ కిచ పాటలు ;
ఉదయ తుషారపు ఊయెలలు ;  
=
piTTala kuwakuwa, kica kica pATalu ;

udaya tushaarapu uuyelalu ;
;
8. నీలి గగనము వంగినది ; 
మూపున వన్నెల హరివిల్లును మోస్తూ ;
=
neeli gaganamu wamginadi ; 

muupuna wannela hariwillunu mOstuu ;
;
9. నీలి గగనమా, లగ్నమెపుడమ్మ ;
ఇంద్రధనువుల ఏడు రంగుల కలయికకు ; 
=
neeli gaganamaa, lagnamepuDamma ;
imdradhanuwula EDu ramgula kalayikaku ;
;
10. సంపంగి దొన్నెలలొ సౌగంధ రాశి ;
ఆస్వాద రసములు, తోటతో పాటు నాకు కూడా  
=
sampamgi donnelalo saugamdha rASi ;
aaswaada rasamulu, tOTatO pATu naaku kUDA
;
11. మునిమాపుకు తన మూపున ;
తారకలను తెచ్చినది సంధ్యారాణి ;
munimaapuku tana muupuna ;
taarakalanu teccinadi samdhyaarANi ; nnela hariwillunu mOstuu ;

12. ప్రేమ సామ్రాజ్యాన సఖి నవ్వు ;
రెపరెపలాడేటి ఉజ్వల పతాకమ్ము
=
prEma saamraajyaana sakhi nawwu ;
reparepalADETi ujwala pataakammu

13. నెమలిపింఛమ్మునకు తగనంత గీర ;
నెలత నెమ్మోమును వేయింతలుగ -
తనదు నెమలి కన్నుల తోటి తిలకించగలుగుతున్నానని ;   
=
nemalipimCammunaku taganamta geera ;
nelata nemmOmunu wEyimtaluga -

tanadu nemali kannula tOTi tilakimcagalugutunnaanani ;
;
14. చెలి బుగ్గ సొట్టలలొ వెన్నెలంతా నిండె ;
ఆ చెంత - చేరినవి, సుదతి - పంటి మెరుపులందందున ;
ముక్కోటి శతకోటి దివ్య తారకలు ;
=
celi bugga soTTalalo wennelamtaa nimDe ;
aa cemta - cErinawi, sudati - pamTi merupulamdamduna ;

mukkOTi SatakOTi diwya taarakalu;
;
15. అష్ట భోగాలన్ని* ఇటనె నెలకొన్నవి ;
నెలత నడుము - మేను, కనురెప్పలు ;
వదన కాంతి, మునిపంటి నొక్కు ;
చెక్కిళ్ళ సొత్తలు, పగడాధరముల ప్రభలు ;
ప్రభవిల్లు భోగాల వైభోగములే తెలియ ;
[* ఇల్లు, పడక, వలువ, నగ ;
చందనం, తాంబూలం - స్త్రీ, పువ్వు ;-
ఇవి ఎనిమిది అనుభవ భోగములు ;
=
ashTa BOgaalann* - iTane nelakonnawi ;
 nelata naDumu - mEnu, kanureppalu ;
wadana kaamti, munipamTi nokku ;
cekkiLLa sottalu, pagaDAdharamula prabhalu ;
prabhawillu BOgaala waiBOgamulE teliya ;
[* illu, paDaka, waluwa, naga ;
stree, puwwu, camdanam, taambuulam - 

iwi enimidi anubhawa BOgamulu  ];
;
16. మదన వ్రతమును చేసె - 
మును జన్మలోన - ఆ ఐదు పువ్వులు* ;
మన్మధుని విల్లున పంచ పుష్పములాయె ;
=
madana wratamunu cEse -
munu janmalOna - aa aidu puwwulu* ;

manmadhuni willuna pamca pushpamulaaye ; 
;
17.  అనురాగ విలసిత గిల్లికజ్జాలు ;
ప్రేమ ముగ్గులలోన గొబ్బిదేవతలు ;
=
anuraaga wilasita gillikajjaalu ;

prEma muggulalOna gobbidEwatalu ;
;
18. ఝరిని నిలిచిన తరుణి - దోసిళ్ళలో నీళ్ళు ; 
అందు - బస చేసినవి, సంధ్యార్ణవమ్ములు - నీళ్ళాడ గోరి ; 

jharini nilicina taruNi - dOsiLLalO neeLLu ; 
amdu - basa cEsinawi, samdhyaarNawammulu - nILLADa gOri ; 
;
19. చిరుగాలికెప్పుడూ చెలి కురులతో రగడ ;
ఆ జగడాలు - రగడలై - కవి ఘంటములకందె ;
=
cirugaalikeppuDU celi kurulatO ragaDa ;
aa jagaDaalu - ragaDalai - kawi ghamTamulakamde ;
;
20. రాగమొకటి గాలిలోన తేలి తేలి వచ్చి ; 
ఘుమ ఘుమల ; మాటెలెన్నొ గుమ్మరించి ;
****************************************** ,
హైకూ తేనీలు - ;
హైకూ ద్విపాద తేనీలు - 141 - 160 

No comments:

Post a Comment