Showing posts with label పిల్లల పాటలు. Show all posts
Showing posts with label పిల్లల పాటలు. Show all posts

Friday, August 14, 2015

జననికి ఆనందబాష్పహారతి

మాతృభూమి కిదే భక్తి హారతి 
          మన భక్తి హారతి; 
భరతభూమికొసగుదాము 
      ఆనందబాష్ప హారతి ||

విశ్వానికి 
అహింసాధర్మప్రబోధిని;  
ఉన్నత ఆదర్శములకు 
భరతావని సారధి;  
  ||మాతృభూమి కిదే 
         ఆనందబాష్ప హారతి ||

స్వాతంత్ర్యం, స్వేచ్ఛ ధృతి 
మార్గదర్శి భారతము 
ఆదర్శరీతి మనుగడకు 
దిక్సూచి మన దేశం
  ||మాతృభూమి కిదే 
         ఆనందబాష్ప హారతి ||


***************************************************

సకల కలర్సు
పేజీ వీక్షణ చార్ట్ 1358 పేజీవీక్షణలు - 36 పోస్ట్‌లు, చివరగా Jul 21, 2015న ప్రచురించబడింది

Monday, September 22, 2014

వయ్యారి వాన!

వానమ్మ వాన! వయ్యారి వాన!

కొంగ్రొత్త రాగమై నిలిచినట్టి అందాల మైనా!

ఈ చిరుజల్లు వాన; అందరీ పయిన పన్నీటి సోన ||

;

వైనవైనాలుగా వివిధ గతులౌతూను- తాను

కోట్లాది ధారల- దారముల పెనవైచి;;;

విభ్రమముగా మన భూగోళ తతులను

నీలాల నింగితో సంధాన పరిచేను!||  

;

డంబముల మేఘాల మాయ తివాచీలను ఎక్కేసి;

హరివిలుల ద్వారాలు దాటివచ్చేను;

పుడమిపై అడుగిడిన బంగారు చాన;

వానమ్మ వాన! వయ్యారి వాన! ||

;

తైతక్కలాడుచూ, ఋతు నాట్యరాణి,

విచ్చేసెనండీ ఈ ఉర్వితలమునకు;

తత్థై నాట్యాలు తకిట థోమ్ దరువులను;

ప్రకృతికి నేర్పేటి నెరజాణ గురువు కదటండీ

మన వర్ష సామ్రాజ్ఞి ||

వానమ్మ వాన! ముచ్చటల వాన!


************************************************,

;
విభ్రమం 

 మేఘాల తివాచీ


;

sakalakalars

పేజీ వీక్షణ చార్ట్ 971 పేజీవీక్షణలు - 21 పోస్ట్‌లు, చివరగా Sep 19, 2014న ప్రచురించబడింది

Wednesday, September 17, 2014

చెమ్కీ కమ్చీ పూన్చిన గుఱ్ఱము

1] చక చక గుఱ్ఱమ్‌, చకారి గుఱ్ఱమ్‌, చక్రవర్తుల దర్పం గుఱ్ఱమ్‌;
టక టక గుఱ్ఱమ్‌, టకారి గుఱ్ఱమ్‌; టక్కరి వేషాలు మానెయ్యి!
మూపున జీను; గిట్టల నాడా; నీకు కానుకలు నేనిస్తున్నా!
పద పద పదవే పదవే రాణీ! తోకల కుచ్చుల మహరాణీ! 
2] సూర్యుని రధముకు ఏడు గుర్రములు;
సప్తాశ్వమ్ముల రధమున సూర్యుడు;
కాలగతికి అది, జగతి సన్నుతి;
నమో నమో ఉదయ ప్రణతి;
3] అర్జున, క్రిష్ణ, భాస్కరాదుల - యోధుల;
రధముల పూన్చిన వారువమ్ములకు;
అన్నిటికిన్నీ ముద్దు పేరులు;           
4] అశ్వమేధము మహాయాగము - 
శౌర్య నిరూపణకు గీటురాయి;
చతురంగబలములు నాటి సైన్యాల;
ఆశ్విక దళముకు ప్రాధాన్యాలు; 
5] హార్సు రేసులు, జాకీ స్వారీ;గుర్రం దౌడు;
గుర్రప్పందాలకు క్రేజు; చెప్పనలవి కాదెవ్వరికీ!
హార్సు పవరు - అని కొలమానం;
నీ త్రుళ్ళింతలు పరిమాణం;  
పోనీ టెయిల్ - హెయిర్ స్టైలుకు-
మూలం నీదు వాలము సుమ్మీ!
,           పద! పద! పదవే! పదవే! రాణీ! 
,                   పద! పద! పదవే! పంచకళ్యాణీ! 
6] తురగవల్గనం నీ బాణీ: పరుగులలోన మనదే బోణీ!
సింగరేణి కడ మొదలిడితే ; రెప్పపాటులో రేణిగుంటలో;
చిట్టగాంగ్ లో నీ దౌడు; చిటికెలోన మము;
చేరుస్తావు చిట్టివలసకు; అహా! నీ పస!
చదరంగములో నీ అడుగుజాడలు;
క్రీడలోన అది హైలెట్టు! 
నువు రన్ వే పైన రాకెట్టు! 
7] కమ్చీ మేము ఝళిపించకుండా;   
టక టక టక టక!
ఝమ్‌, ఝమ్‌, ఝమ్‌,ఝమ్‌,
ఝామ్‌, ఝామ్‌న
,           పద! పద! పదవే! పదవే! రాణీ! 
,                  పద! పద! పదవే! పంచకళ్యాణీ! 

*****************************************,
జాతిపిత మహాత్మా గాంధీజీ గుర్రం వద్ద 
నిలబడి ఉన్న అరుదైన ఫొటో ఇది. 

;











*****************************************, 
కమ్చీ , చిహ్నము, చెమ్కీ, మ్ , న్, ~ళు =~Lu ~L ,  
 చెమ్కీ కమ్చీ పూన్చిన గుఱ్ఱము