Sunday, November 25, 2018

హైకూ ద్విపాద తేనీలు - 160 -180

1. తన చూపులలో మృదు లయ హొయలు ;
నా ఎద లోయల ప్రతిధ్వనులు ; 
=
tana cuupulalO mRdu laya hoyalu ;

naa eda lOyala pratidhwanulu ; 
;
2. నింగి నుండి నేలకు - కొత్త వీణియ
వర్షధారల తీగల బిగింపు
మేఘ మల్హారముల రాగాల హేల

nimgi numDi nElaku - kotta weeNiya ; 
warshadhaarala teegala bigimpu ;
mEGa mal haaramula raagaala hEla ;
;
3. దారముల అల్లిబిల్లి వలువపైన ;
జిలిబిలిగా చిత్రములై చేరితే ;
నా ఎడద - నిత్య పున్నమి జాబిల్లి ఆయె ;  
=
daaraamula allibilli waluwapaina ;
jilibiligaa citramulai cEritE ;
naa eDada - 

nitya - punnami jaabilli aaye ;
;
4. నారి ఒడలు 'పలక ' పైన ;
అక్షరముల వెలయించెను ;
చెట్టు నీడ పొడలు ; 
=
naari oDalu 'palaka ' paina ;
aksharamula welayimcenu ;
ceTTu neeDa poDalu ;
;
5. కాసె బోసి, మడి కట్టు ;
కనికట్టుగ అనుభూతి అయి ;
కాస్తసేపు అట్టె ఆగి, 
చూచేను వెన్నెలమ్మ 
=
kaase bOsi, maDi kaTTu ;
kanikaTTuga anubhuuti ayi ;
kaastasEpu aTTe aagi, 

cuucEnu wennelamma ;
;
6.  వెన్నెల వీణియ మీటెను చెలియ ;-
ఆలాపనలకు అతిశయమే ;
=
wennela weeNiya meeTenu celiya ;

aalaapanalaku atiSayamE ;
;
7. దశదిశలా తెలి వెన్నెల ;
అది చెలియ దరహాసము ;
=
daSadiSalA teli wennela ;

adi celiya darahaasamu ;
8. దశ తిరిగెను నవ్వులకు ;
సుదతి కెంపు పెదవులను చేరెను కద!
=
daSa tirigenu nawwulaku ;
sudati kempu pedawulanu cErenu kada!
;
9. సాంద్ర కిరణరేఖవై, సుదతీ, 
కరుణను కురిపించుమా ; 
=  
saamdra kiraNarEKawai, sudatee, 
karuNanu kuripimcumaa ;
;
10. తమ ఛాయల మేలిముసుగు,
తరుణి కొసగె తరువులు;
=
tama Caayala mElimusugu ;

taruNi kosage taruwulu ; 
;
11. లాలనతో ఒక పాట ;
లలన పెదవి చేరేను ; 
=
laalanatO oka paaTa ;

lalana pedawi cErEnu ; 
12. రేయి కుడ్యం పైన ఎన్ని శిల్పాలో ;
జాబిల్లి, తారకలు, గ్రహ,గోళరాసులు
=

rEyi kuDyam paina enni SilpaalO,

jaabilli, taarakalu, graha gOLa raasulu ;
;
13. శాంతం, మమత = చెలియ విలాసం; 
ప్రేమ, వికాసం - పరిణామం = ఇక 'ఆకాశం' ;
=
SAmtam, mamata celiya ; 

prEma, wikaasam - pariNAmam ika 'aakaaSam' ;
;
14. వేదన తీరెను ఈనాడే ;
చెలి - కృపా వీక్షణం నాదే నాదే ;
=
wEdana teerenu iinADE ;

celi kRpaa wIkshaNam naadE naadE ; 
;
15. తపించు చున్నది నా మనసు ; 
మమతా రాగం నడి సంద్రమున ; 
=
tapimcu cunnadi naa manasu ; 
mamataa raagam naDi samdramuna ; 
;
16.  తపించుచున్న ప్రేమ హృది ;
తప్పించుకొనగలదా వెన్నెల వేడిమిని ;
=
tapimcucunna prEma hRdi ;

tappimcukonagaladaa wennela wEDimini ;
;
17.  వలపు విపంచి రాగములెన్నో ; 
పంచిన కొలదీ మిన్నంటేను ;

walapu wipamci raagamulennO ; 
pamcina koladee minnamTEnu ;
;
18. మమతా లాహిరి చెమ్మదనం ;
మనమంతా వసంత ఋతువు సందడి ;
=
 mamataa laahiri cemmadanam ;
manamamtaa wasamta Rtuwu samdaDi ;
;
19. విశాల పర్ణకుటీరం వెన్నెల ;
ప్రేమకు ఆది శరణాలయమ్ము ; 

wiSaala parNakuTIram wennela ;
prEmaku aadi SaraNAlayammu ; 
;
20. శ్యామలవేణీ, నీ కురులు -
మన్మధ వీణకు అమరిన తంత్రులు ;

SyAmalawENee, nee kurulu -
manmadha weeNaku amarina tamtrulu ;
;
place - 1 ;- [ Link ] ;-
Place - 2 ;- [ Link ] ;-  

No comments:

Post a Comment