Saturday, December 16, 2017

హైకూ ద్విపాద తేనీలు - 21 - 40

1. నా ఊహల కోవెలలో ;  
సదా ఉవిదయె దేవత ; 
;
2. మేఘరహిత సౌదామినులు ; 
చెలి - హాసిని దరహాసాలు ;  
;
3. నింగిని వెన్నెల సౌష్ఠవ మేల? ;
వచ్చెను జాబిలి నేడు పున్నమిగ ; ;
;
4. మొయిలు పడవలలోన - 
ఈ ఇలకు దిగి రావమ్మా చిన్నారి నెలవంక ; 
;
5. మబ్బుల భరిణలు పసిడి సమానం ; 
అందున అంబువు పదిలం పదిలం ;
;
6. చెట్టు నీడ పావడా - పరచుకుని 
కూర్చున్నది 'నేలబాల' ; 
=
 ceTTu nIDa paawaDA - paracukuni,
 kuurcunnadi nEla baala ;
;
7. గగనం ఖాళీ, చుక్కలెక్కడ? - 
లెక్కిస్తున్నా, జవ్వని జడలో మల్లికలెన్నని? =
=  
gaganam khaaLI, cukkalekkaDa? ; 

lekkistunnaa - jawwani jaDalo mallikalalennani? ; 
;
8.వెన్నెలకు ' ఉపవాసం' -
అమావాస్య రేయి నేడు ; 
=
9. వెన్నెల లేదు - పస్తులు నింగికి!!? ; 
గైకొను మివిగో వనిత నవ్వులు ; 
;
10. మెలమెల్లగ జగతిపైన విస్తరణలు ;
తొలిపొద్దు కిరణగీత లాలనలు ; 
=
mela mellagaa jagatipai wistaraNalu ; 
toli poddu kiraNa  laalanalu ; 
;
11. అమావాస్య రేయి నేడు ; 
వెన్నెల నోములు, ఉపవాసం ; 
=               
11. amaawaasya rEyi nEDu ; 
wennela nOmulu, upawaasam 
;
12. అనుభవాలు జీవిత పాఠ్య పంక్తులు ;
 అధ్యాపకుడు బోధించే కాలమే!   
;
13. తెరలు తెరలుగా దగ్గుతూ మబ్బులు ;
వాన తెరలను దించుతూన్నవి వసుంధరకు  
;  
14. మేఘం సింగారం ;
  మెరుపు పాపిట బిళ్ళ తళతళా ;
;
15. మాలతి మాధవాలు ; 
వాలుగాను ఊగుతూన్న పూలతీగ జుంకీలు ;
;
16. మబ్బులకేమో తటపటాయింపు ; 
మెరుపుల కీలాగ చిటపటలు ; 
;
17. భావముల వలయాలకు "అక్షము" - 
అక్షరమే, అక్షరాలా, ప్రియనేస్తం! 
;
18. వన్నెల సీతా కోకలు ; 
తోటల, తోపుల మృదు ప్రబంధములు ; 
;
19. తోటలో మల్లిక, తోపులో మావి పూత 
తేట తెనుగు తావి - మాట గుబాళింపు ;
;
20. ద్వీపం నడుమన ఉన్నది కోవెల ;  
చుట్టూ వలయం - నది వడ్డాణం ;  
;
 - హైకూ ద్విపాద తేనీలు - 21 -  40  ;
;

No comments:

Post a Comment