Saturday, December 16, 2017

హైకూ ద్విపాద తేనీలు - 1 - 20

1. పసుపు కొమ్ము, శొంఠి కొమ్ము; వస్తువులకే ఉన్నప్పుడు, 
మనుషుల్లో కొందరికి కొమ్ములు ఉంటే విడ్డూరమేమున్నది!?
;
2. వర్ష ఋతువు ఆగమనం ; 
శుష్క గ్రీష్మ నిర్గమనం ; 
;
3. గగనం దింపిన నక్షత్ర పల్లకి ;
శోభలీనెడు మగువ సిరి నగవు ;

gaganam dimpina nakshatra pallaki ;
SOBaleenu maguwa nagawu/ wwu ;
;
4. నీదు వీక్షణముల వాహినిలో ; 
క్షణములు అన్నీ  'గజఈత' నేర్చిన మీనులు ;
= = needu weekshaNamula waahinilO ; 
kshaNamulu eeta nErcinameenulu
;
5. నీలవేణి వంకుల కురులలోన ;
చిరుగాలికి చక్కనైన చక్రబంధమే!;
5. neelawENi wamkula kurulalOna ;
cirugaaliki cakkanina cakrabamdhamE! 

;
6. వర్ష ఋతువు నిండు పేరోలగం ; 
కోటి చినుకుల సభికులు ; 
= warsha Rtuwu నిండు pErOlagam ; 
kOTi cinukula sabhikulu ; 21 june17 
;
7. చినుకుల లకుముకి పిట్టలు ; 
వాలెను పృధ్వీ వృక్షమున - ; 
= చినుకుల lakumuki piTTalu ; 
waalenu pRdhwee wRkshamu payina; 
;
8. మల్లెల విరి చేవ్రాళ్ళు 'ఆన' ;

మదిని విరిచెను తన నిర్లక్ష్యం ; 
;
9. సర్వాంగ సుందరం ప్రకృతి మందిరం ; 
ఇందిందు చేరేను ఇంతి దరహాసం ; 
;
10. చినుకుల పక్షులు వాలుతున్నవి ;
 చెలమల వలయపు చిత్రణలు ;  
;
11. మేఘ ధృతి రాగం ; 
వర్ష ఉధృతి సంగీతం ;
;=
mEGa dhRti raagam ;
warsha udhRti samgeetam - 
;
;
12. విహంగముల హంగామా ;
    మబ్బు చినుకు ఖజానా ; 
;
13. మాధవ 'తిలకం' - 
          మాలతి పువ్వు ;  
;
;
14. విహంగముల హంగామా ;
    మబ్బు చినుకు ఖజానా ; 
;
15. మాధవ 'తిలకం' - 

      మాలతి పువ్వు ;  
;
16. దండోరా వేస్తూన్నవి మబ్బులు ; 
ఇంక - వర్ష ఋతువు వచ్చేసిందోహో!' అంటూ ; 
;;
17. కురవండోయీ నీలి మబ్బులూ! ; 
పరుగుకు ముందే ఆయాసమా? భళీ!
;
18. నా ఊహల కోవెలలో ; 

దేవత ఉవిదయె సదా సదా ; 
;
19. మేఘరహిత సౌదామినులు ; 
హాసిని దరహాసాలు ;   
;
2o. ఉల్కా పుష్పం తళుక్కున జారెను ;  

ఉలుకు ఎక్కువే, ఏ ఒడి చేరెనో!?
;

No comments:

Post a Comment