Saturday, December 16, 2017

హైకూ ద్విపాద తేనీలు - 41 - 60

1. వెన్నెల రధ సారధి - ఓ జాబిల్లీ! 
నీకు ధరణిసుస్వాగతమిదిగో! 

1.  wennela radha saaradhi - O jaabillee! 
neeku dharaNi suswaagatamidigO!  
;
2. లావణ్యవతి నగవు పంచన చేరాను ; 
పంచదార చిలకను ఐనాను లెస్సగా!
=
2] laawaNyawati nagawu pamchana chEraanu ; 

pamchadaara chilakanu ainaanu lessagaa! 
;
3. కిక్కిరిసిపోతోంది ఎద పంజరం ; 
బందీలు ఐనట్టి ఊహల పక్షులతొ  ;
;
4. పున్నమి జాబిలి చెల్లించేను భారీ బాకీ ;  
లేమ నవ్వులకు శుల్కంగా-  ;
=
లేమ nawwulaku Sulkam bhaaree baakee - 
cellimcEnu wennelanu - punnami jaabili ; 
;
5. సృష్టి ఘనతకు కొలబద్ద ఏమిటి!?

   కనులను కట్టి పడేసే సౌందర్యాల బంధాలు ;
;
6. ప్రణయానిది పై చేయి ఐతే చప్పట్లు; 
కిందైతే విరహాల కుంపట్ల సెగలు ; 
=
6] praNayaanidi pai chEyi aitE chappaTlu, 
kimdaitE wirahaala kumpaTla segalu ; 
;
7. అనుభవాలు జీవితపాఠ్య  పంక్తులు ;
కాలం బోధించే మంచి పంతులు ;  
anubhawaalu jeewitapaaThya  pamktulu ;

kaalam bOdhimcE mamci pamtulu ; 
;
;
8. పచ్చని వన దేవీ! వందన శత కోటి ;
నీదు సురభిళ నగువుల తేటలకు ;
; = 
8.  paccani wana dEwee! wamdanam ; 
needu surabhiLa naguwala tETalaku ;

;
9. ఎన్నెన్ని సొగసులకు, పోలికలకు ;

పసిడి అక్షయపాత్ర ఈ ప్రకృతి ;
;
10. విశ్రమించె మెరుపులు ; 
మేఘ శయ్యలందున ; 
=
10. wiSramimce merupulu ; 
mEGa Sayyalamduna 

;
12. కనుపాపలకు వందనం ; 
చూపుల నిధులకు గని ఐనందుకు ;
;  
13. పక్వ ఫలం -
తూర్పు దిక్కు పసిడి పళ్ళెంలోన ;  
=
pakwa phalam tuurpu dikku pasiDi 

paLLemlOna ;
;
14. విరబూసిన సంపెంగలు ;
పరిమళాల బరువులతో ..... ;
=
parimaLAla baruwulatO wirabuusina సంపెంగlu 
;
15. నిర్ఘాంతపోయె మన్మధుడు ;

చెలి నీలి కురులలోకి చేరె పంచ పుష్పములు ; 
;
16. పాల పూతల - పుంతల దారుల ; 
వియచ్చర కన్యల హంసల నడకలు - 

paala puutala - pumtala daarula ; 

wiyaccara kanyala hamsala naDakalu ; 
;
18. కనుపాపల నందనముకు ; 
ప్రకృతీ వందనము ; 

kanupaapala namdanamuku ;

prakRtee wamdanamu  ; 
;
19. కెరటాల పైన వెన్నెల ఏలనో!?

ఆరబోసింది కదా కోమలి - తన నవ్వులన్నీ ;
;
20. నవ మల్లిక పరిమళం ;
వనదేవికి హారతి ;;
;
;    -  హైకూ ద్విపాద తేనీలు - 41 - 60 ; 

No comments:

Post a Comment