Saturday, December 16, 2017

హైకూ ద్విపాద తేనీలు - 81 - 100

1.మనసు పుటలకు మకిలి పూయకు, నేస్తం ;
ఇంద్రధనుసులకు ఆలవాలము శ్వేత వర్ణమే తెలుసుకో ;   

మనసు పుటలku makili puuyaku, nEstam ;
imdradhanusulaku aalawaalamu SwEta warNamE telusukO ;  
;
2. బ్రతుకు నింగిపై ఉషాకిరణాలు ;
వెల్లివిరియాలని ఎంతో ఆకాంక్ష ; 

bratuku nimgipai - ushaa kiraNAlu ;
welliwiriyaalani emtO aakaamksha .

3. ఏమనగలను, ప్రేమ నెమలిని ; 
తన పురిని విప్పి చేయు మేల్మి ఆటను మరచిపోతే- 
= 3. Eమనgalanu, prEma nemalini ; 
tana purini wippi cEyu mElmi ATanu maracipOtE-;
;
4. మాలిమి చేసుకున్నవి మేలి ముసుగులు ;
చెలియ మోము సోయగములను భళి  ;

maalimi cEsukunnawi mEli musugulu  ;
celiya mOmu sOyagamulanu bhaLi ;
;
5. తేటి ఆట తేనె పాట ; 
ఋతు మేదిని, మధు ఊట  ;

5. tETi ATa tEne pATa ; 

Rtu mEdini, madhu uuTa ;
;
6. తెలి వెన్నెలలో చక్రబంధము  ;
వరదగుడిలోన రేరాజు చందురుడు 
=
teli wennelalO cakra bamdhamu ;    
waradaguDilOna rEraaju camduruDu ; 

7. స్వేచ్ఛగా విహారం చేయాలని ఆపేక్ష మనిషికి ;

విధ్వంసానికి గురైన ప్రకృతి నవ్వింది విషాదంగా ;
;
8. చెలి నవ్వులకు జాబిలి బాకీ ; 
వెన్నెల వడ్డీ ఇస్తున్నానూ. 
=
8. celi nawwulaku jaabili baakee ; 
wennela waDDee istunnaanuu. 
;
9. జవ్వని నవ్వు - 'మధు మాయ' ;          
నా మది ఆయెను మయూరిగా ; 
=
jawwani నwwu madhu maaya ;          
naa madi aayenu mayuurigaa ; 
;
10. నయనమె సాక్షి ; 
చూపుల ఖైదీ - సఖి సౌందర్యము ; 

nayaname saakshi ; 
cuupula khaidee - sakhi saumdaryamu ;
;
11. అంజనమేది, చీకటి రేయికి ?
వనితామణీ! నీ కంటికాటుక ; 

11. amjanamEdi, ceekaTi rEyiki ?

wanitaamaNii! nee kamTi kATuka ; 
;
12. విప్పారే ప్రణయ భావపద్మాలు ;
కావ్యాల కొలనులకు కలిగించే పూర్ణత్వం ;
= wippaarE praNaya bhaawa padmaalu ;
  kaawyaala kolanulaku sampuurNatwam.
;
13. చుక్కల పంటలు ; 
రేయి పొలం మడి నిండా; 
=
13. rEyi maLLa nimDA ; 
  chukkala pamTalu. 
 ;
14. ఘుమఘుమలెన్నో పూల బాలల ఆస్థి ;
రిమ ఝిమలన్నీ తరుణి నగవుల ఆస్థి.

ghumaghumalennO puuwula aasthi

rima jhimalannii taruNi haa]sammula aasthi ;

;  
15. కంచుకాగడా తూరుపు దిక్కున ;
  ప్రభాత చైతన్యాలకివే ఆహ్వానములు.
=
 kamchukaagaDA tuurupu dikkuna
 prabhaata chaitanyaalakiwE aahwaanamulu.   
;
16. కొండల జలపాత కెరటాల 
  సేదదీరుతు ఉన్నవి ఇంద్రధనుసులు.

16. komDala jalapaata keraTAla 
  sEdadeerutu unnawi imdradhanusulu.
;
17. మెరుపు దండముల తరాజులు ; 
మేఘాలు, బరువుల తూచే సిబ్బిలు ; 

17. mEGAla sibbilu ;  tuustunnadi   taaralanu ; [ ♣♣♣ ] ; 
;
18. లోయలలోన కిరణాలు -
మేలిమి 'సరిగ - పోగుల' అల్లికలు ;
;
19. జరీ సరిగ బుటాలను ;

రాత్రి తివాచీపైన కుట్టినది ఎవ్వరో!?
;
20. అమావాస్య ఇది, వెన్నెల ఎటుల!?
       చెలి నవ్వుల కాంతులవి ;
;
- హైకూ ద్విపాద తేనీలు - 81 - 100 ; 
శత ద్విదళాలు ; డిసెంబర్ పోస్ట్ ; శత ద్విదళాలు ; =
Sata dwidaLAlu ; Disembar pOsT ; 

No comments:

Post a Comment