Saturday, April 9, 2011

paurI raam lIla - 4















        ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~      
పౌరీ  రామ్ లీల :- ఈ ప్రాచీన దర్శన కళ,1897 ల నుండి  హిమాచల్ ప్రదేశ్ లో రంగము(Stage)మీద ప్రదర్శించ బడుతూన్నది.తులసీ దాసు రచన "రామ చరిత మానస మానస" ముఖ్య ఆధార కథలు. ఐనప్పటికీ స్థానిక వాతావరణ సౌరభాలతో పుష్పిస్తూన్న నాటక కళ. స్థానిక దేవత "కండీలియా"ను "తమ ప్రదర్శనను విజయవంతం చేయమని" ప్రార్థించి, ప్రదర్శనను ఆరంభిస్తారు. (local deity kandolia)"ఎలాటి అవరోధాలు కలగకుండా దిగ్విజయంగా  నాటకము కొనసాగాలని" కాండిల్యా దేవుని ప్రార్ధన చేస్తారు.ఇది మన తెలుగు వారి - యక్ష గానములలో, కూచిపూడి, భాగవతుల ప్రదర్శనలలోసూత్రధారులు  అనుసరించే "సూత్రధారుల నాందీ ప్రస్తావన"లాటిది అన్న మాట! భాగేశ్వరీ, బిహాగ్, దేశ్, దర్బారీ, మాల్ఖోస్ మొదలగు సాంప్రదాయ సంగీత రాగాలను వాడెదరు.  అంతే కాక లోకల్ రాగాలను కూడా - రాగ్ రాగిణీలునూ,జానపద /Folk songs)గేయాల రాగచ్ఛాయలను కూడా వీరి సంగీత రూపక ప్రదర్శనలలో ఇమిడి ఉంటూంటాయి.[Ramlila ,Bageshwari, Bihag, Desh, Darbari, Malkons classical ragas, local rag-raginis and folk songs} Ram Varta in Dhol-damaun :-  ఘర్వ్హాల్ ప్రాంతాలలో   రామ వార్త/ రామన్ ప్రదర్శన ప్రాచీమైనది. ఢోల్ డమన్ లలో ఇది ప్రాచుర్యతను కలిగిఉన్నది.రెండు డోలు - వాద్య పరికరాలు ఇచ్చట ఆకర్షణీయమైనవి; ఒకటి పెద్ద సైజు, రెండోది చిన్న డోలు.ఈ డోలు వాద్యకారులను ఔజీలు (aujii) అని పిలుస్తారు."పాండ్వానీ ప్రక్రియ శైలి"నే Ram liila గాన వరుసలలో కూడా అనుసరిస్తారు.  14 రకాల లయ విన్యాసాలను డోల్ డమన్ వాద్యాలలో ఉపయోగిస్తారు.
          
              పౌరీ  రామ్ లీల  (Link for Reading article)
             (paurI raam lIla in Himachal pradesh)



No comments:

Post a Comment