Friday, November 30, 2018

ఓమ్ కారం వనిత కురులు

చెలియ నీలవేణి, ఉంగరముల ముంగురులు ; 
ఓమ్ కారము రీతి  అలరారుచుండె ; 
గాలి బాలికలు వాని నుండి ; 
అటూ ఇటూ గంతులేస్తున్నవి, 
వింతగా .......
ఆ కుప్పిగంతులే క్రమ క్రమముగ ;
నవ నవీనమౌనాట్య నర్తనలుగ 
నేత్రపర్వముగ - పరిణమిస్తూ .....
;
=================================,
;
Okaaramm wanita kurulu ;-
;
cheliya neelawENi umgaramula mumgurulu ; 
Omm kaaramu reeti  alaraarucumDe ; 
gaali baalikalu waani numDi ; 
aTuu iTU gamtulEstunnawi, 
wimtagaa .......
aa kuppigamtulE krama kramamuga ;
nawa naweenamaunATya nartanaluga 
nEtraparwamuga - pariNamistuu ........... ;
;
ఓమ్ కారం వనిత కురులు ;- కవితా చెలి - 3 ; డిసెంబర్ - 2018 ;

మరుత్తు వైణికునిగ మారింది

నాదు మరుద్వతి కవితా చెలియ ;
వీణాతంత్రులు ; కోమలి కురులు ; 
ఇన్ని నాళ్ళుగా ............ 
నిద్రలో మత్తుగా జోగుతున్నది గాలి;
మత్తు వీడిన గాలి ; ఉలికిపాటున లేచి ; 
నాదు మరుద్వతి కేశములపి వాలినవి ; 
మరుద్ వీచికలు సాగే సంగీతం తరంగాలు! 
మరుత్తు -
ఇపుడు మంచి వైణికునిగ మారినదండీ! 

============================= , 
;
maruttu waiNikuniga maarimdi ;-
;
naadu marudwati kawitaa celiya ;
wINAtamtrulu ; kOmali kurulu ; 
inni nALLugaa ............ 
nidralO mattugaa jOgutunnadi gaali;
mattu weeDina gaali ; ulikipATuna lEchi ; 
naadu marudwati kESamulapi waalinawi ; 
marud weechikalu saagE samgeetam taramgaalu! 
maruttu -
ipuDu mamchi waiNikuniga maarinadamDI! 
;
మరుత్తు వైణికునిగ మారింది ;- కవితా చెలి - 2 ; డిసెంబర్ - 2018 ;

కుంతలములు - మేఘమల్హారములు

మేఘాలలో నీలిమను దాచి ఉంచె,
నిపుణముగా నీలి నింగి;
తుంటరిగా 'విసురు - గాలి' ;
మొయిలులను విసరివైచె! ;
నీరదముల మూటలన్ని విడిలి పోయె!
మూటలలో గాఢ తమము [= చీకటి] చెల్లాచెదురవకుండా -
‘తమను భద్రపరచమనీ’ ;
శరణు వేడె చెలి కుంతలములను!*
;
Notes ;-  కుంతలములు [=జుట్టు] ;
;
=================================,
;
mEGAlalO neelimanu daachi umche,
nipuNamugaa neeli nimgi;
tumTarigaa ‘wisuru- gaali’ ;
moyilulanu wisariwaiche! ;
neeradamula mUTalanni wiDili pOye!
mUTalalO gaaDha tamamu* 2 chellaachedurawakumDA -
tamanu bhadraparachamanii ;
SaraNu wEDe cheli kumtalamula! [=juTTu] ;  
;
tamamu* 2 [= cheekaTi] ;
***********************************,
Notes ;-
మేఘమల్ హారములు ;  
మేఘ malhara -> lEkhini script = మళార  ;
mal haa- మేఘమల్ హారములు -> మల్ + హార  -> మల్హార ;
;
కుంతలములు - మేఘమల్హారములు ; - కవితా చెలి - 1 ; డిసెంబర్ - 2018 ;

Tuesday, November 27, 2018

కెమేరాలు లేని రోజులు - సి.పి. బ్రౌన్ PAINTING

కడప కలెక్టర్ Charles Philip Brown.
సి.పి. బ్రౌన్ [ C.P. Braun - (10 November 1798 – 12 December 1884)]- 
తెలుగు సాహిత్యాన్ని - తెలుగు సాహిత్యాన్ని - కొత్త కోణాలలో విశ్లేషించే ప్రక్రియలను - 
ఆంధ్ర ప్రజలకు అందించారు. అతను ఎట్లా ఉంటాడు? 
కెమేరాలు లేని రోజులు కదా. బ్రౌన్ ఎట్లా ఉంటాడు, 
మనకు బ్రౌన్ చిత్రం ఎట్లాగ అందింది? 
కెమేరాలు లేని రోజులు కదా. బ్రౌన్ ఎట్లా ఉంటాడు, 
మనకు బ్రౌన్ చిత్రం ఎట్లాగ అందింది? 
ఇది ఆసక్తికరమైన అంశమే కదూ!
బ్రౌన్ కుమారుడు డేవిడ్. 
జానుమద్ది హనుమచ్ఛాస్త్రి సాహితీ కృషీవలురు. 
బ్రౌన్ తనయుని ద్వారా - పోలికలను తెలుసుకున్నారు. 
బుడంగుంటలో శాస్త్రి - ప్రయత్నం కొనసాగింది. 
జానమద్ది  శాస్త్రి గారు మైనంపాటి సుబ్రహ్మణ్యం వద్దకు వెళ్ళారు. 
"'బ్రౌన్ ఛాయా చిత్రాన్ని వేయండి సుబ్రహ్మణ్యం."'
అని కోరారు శాస్త్రి. 
ఆ విధంగా మనకు ఈనాడు ఛార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ పెయింటింగ్ లభించింది. 
నేడు తెలుగు సాహిత్య ప్రపంచంలో - 
మైనంపాటి సుబ్రహ్మణ్యం - వేసినట్టి బ్రౌన్ పెయింటింగ్ నే అనుసరిస్తున్నారు. ;  
;     
===============================;
kaDapa kalekTar braun [# C.P. Braun - (10 November 1798 
– 12 December 1884)#]- telugu saahityaanni - kotta 
kONaalalO wiSlEshimcE prakriyalanu - aamdhra prajalaku 
amdimcaaru. 
atanu eTlaa umTADu? kemEraalu lEni rOjulu kadaa. braun 
eTlaa umTADu, manaku braun citram eTlaaga amdimdi? 
idi aasaktikaramaina amSamE kadU!
braun kumaaruDu DEwiD. jaanumaddi hanumacCAstri 
saahitee kRsheewaluru. braun tanayuni dwaaraa - 
pOlikalanu telusukunnaaru.
buDamgumTalO SAstri - prayatnam konasaagimdi. 
hanumat శాస్త్రి gaaru mainampATi subrahmaNyam waddaku weLLaaru.
'braun CAyA citrAnni wEyamDi subrahmaNyam. ' ani kOraaru SAstri. 
aa widhamgaa manaku eenADu Caarles philips braun peyimTimg labhimcimdi. 
nEDu telugu saahitya prapamcamlO - mainampATi subrahmaNyam - 
wEsinaTTi braun peyimTimg nE anusaristunnaaru. ; 
;
CPBrown - A real servant - Andhra sahithi ;
;
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''' ;
ॐ। ॐ। ॐ। ॐ।  ॐ।ॐ। ॐ। ॐ। ॐ। ॐ।  ॐ।
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''' ;
కెమేరాలు లేని రోజులు - సి.పి. బ్రౌన్ How we get Brown's Image ;  

Sunday, November 25, 2018

హైకూ ద్విపాద తేనీలు - 160 -180

1. తన చూపులలో మృదు లయ హొయలు ;
నా ఎద లోయల ప్రతిధ్వనులు ; 
=
tana cuupulalO mRdu laya hoyalu ;

naa eda lOyala pratidhwanulu ; 
;
2. నింగి నుండి నేలకు - కొత్త వీణియ
వర్షధారల తీగల బిగింపు
మేఘ మల్హారముల రాగాల హేల

nimgi numDi nElaku - kotta weeNiya ; 
warshadhaarala teegala bigimpu ;
mEGa mal haaramula raagaala hEla ;
;
3. దారముల అల్లిబిల్లి వలువపైన ;
జిలిబిలిగా చిత్రములై చేరితే ;
నా ఎడద - నిత్య పున్నమి జాబిల్లి ఆయె ;  
=
daaraamula allibilli waluwapaina ;
jilibiligaa citramulai cEritE ;
naa eDada - 

nitya - punnami jaabilli aaye ;
;
4. నారి ఒడలు 'పలక ' పైన ;
అక్షరముల వెలయించెను ;
చెట్టు నీడ పొడలు ; 
=
naari oDalu 'palaka ' paina ;
aksharamula welayimcenu ;
ceTTu neeDa poDalu ;
;
5. కాసె బోసి, మడి కట్టు ;
కనికట్టుగ అనుభూతి అయి ;
కాస్తసేపు అట్టె ఆగి, 
చూచేను వెన్నెలమ్మ 
=
kaase bOsi, maDi kaTTu ;
kanikaTTuga anubhuuti ayi ;
kaastasEpu aTTe aagi, 

cuucEnu wennelamma ;
;
6.  వెన్నెల వీణియ మీటెను చెలియ ;-
ఆలాపనలకు అతిశయమే ;
=
wennela weeNiya meeTenu celiya ;

aalaapanalaku atiSayamE ;
;
7. దశదిశలా తెలి వెన్నెల ;
అది చెలియ దరహాసము ;
=
daSadiSalA teli wennela ;

adi celiya darahaasamu ;
8. దశ తిరిగెను నవ్వులకు ;
సుదతి కెంపు పెదవులను చేరెను కద!
=
daSa tirigenu nawwulaku ;
sudati kempu pedawulanu cErenu kada!
;
9. సాంద్ర కిరణరేఖవై, సుదతీ, 
కరుణను కురిపించుమా ; 
=  
saamdra kiraNarEKawai, sudatee, 
karuNanu kuripimcumaa ;
;
10. తమ ఛాయల మేలిముసుగు,
తరుణి కొసగె తరువులు;
=
tama Caayala mElimusugu ;

taruNi kosage taruwulu ; 
;
11. లాలనతో ఒక పాట ;
లలన పెదవి చేరేను ; 
=
laalanatO oka paaTa ;

lalana pedawi cErEnu ; 
12. రేయి కుడ్యం పైన ఎన్ని శిల్పాలో ;
జాబిల్లి, తారకలు, గ్రహ,గోళరాసులు
=

rEyi kuDyam paina enni SilpaalO,

jaabilli, taarakalu, graha gOLa raasulu ;
;
13. శాంతం, మమత = చెలియ విలాసం; 
ప్రేమ, వికాసం - పరిణామం = ఇక 'ఆకాశం' ;
=
SAmtam, mamata celiya ; 

prEma, wikaasam - pariNAmam ika 'aakaaSam' ;
;
14. వేదన తీరెను ఈనాడే ;
చెలి - కృపా వీక్షణం నాదే నాదే ;
=
wEdana teerenu iinADE ;

celi kRpaa wIkshaNam naadE naadE ; 
;
15. తపించు చున్నది నా మనసు ; 
మమతా రాగం నడి సంద్రమున ; 
=
tapimcu cunnadi naa manasu ; 
mamataa raagam naDi samdramuna ; 
;
16.  తపించుచున్న ప్రేమ హృది ;
తప్పించుకొనగలదా వెన్నెల వేడిమిని ;
=
tapimcucunna prEma hRdi ;

tappimcukonagaladaa wennela wEDimini ;
;
17.  వలపు విపంచి రాగములెన్నో ; 
పంచిన కొలదీ మిన్నంటేను ;

walapu wipamci raagamulennO ; 
pamcina koladee minnamTEnu ;
;
18. మమతా లాహిరి చెమ్మదనం ;
మనమంతా వసంత ఋతువు సందడి ;
=
 mamataa laahiri cemmadanam ;
manamamtaa wasamta Rtuwu samdaDi ;
;
19. విశాల పర్ణకుటీరం వెన్నెల ;
ప్రేమకు ఆది శరణాలయమ్ము ; 

wiSaala parNakuTIram wennela ;
prEmaku aadi SaraNAlayammu ; 
;
20. శ్యామలవేణీ, నీ కురులు -
మన్మధ వీణకు అమరిన తంత్రులు ;

SyAmalawENee, nee kurulu -
manmadha weeNaku amarina tamtrulu ;
;
place - 1 ;- [ Link ] ;-
Place - 2 ;- [ Link ] ;-  

హైకూ ద్విపాద తేనీలు - 141 - 160

1. వర్ష ఋతువు దస్తూరి కోసమై వేచి ఉన్నది ;
మాదిరి ప్రశ్న పత్రం - 'మబ్బు తునక' ;
=
warsha Rtuwu dastuuri kOsamai wEci unnadi ;
maadiri praSna patram - 'mabbu tunaka ;
;
2. కొమ్మ కొసలోన పువ్వులు నవ్వాయి ;
మందార కొమ్మకు గోరింట పండింది ;
=
komma kosalOna puwwulu nawwaayi ;

mamdaara kommaku gOrimTa pamDimdi ;
;
3. కుడ్యాల మూలలో ఎంబ్రాయిడరీలు ;
సాలీడు నేసిన చక్కని గూళ్ళు అవి ; 
=
kuDyaala muulalO embraayiDareelu ;
saaleeDu nEsina cakkani guuLLu awi ; 
;
4. పట్టు పట్టిన నా మదిలోని పాటలు ;
చేరినవి ఇంచక్క - శారదా వీణియను ;
=
paTTu paTTina naa madilOni pATalu ;
cErinawi imcakka - SAradaa weeNiyanu ; 
;
5. పట్టు కుచ్చు జడకుచ్చులు ;
సంక్రాంతికి పట్టిన జయ కేతనాలు ;
=
paTTu kuccu jaDakucculu ;
samkraamtiki paTTina jaya kEtanaalu ;
;
6. పటుకు పటుకు పటిక బెల్లం ; 
నేటి పిల్లలు మరచిన -
- మధు తినుబండారం ;

paTuku paTuku paTika bellam ; 
nETi pillalu maracina -
- madhu tinubamDAram ;
;
7. పిట్టల కువకువ, కిచ కిచ పాటలు ;
ఉదయ తుషారపు ఊయెలలు ;  
=
piTTala kuwakuwa, kica kica pATalu ;

udaya tushaarapu uuyelalu ;
;
8. నీలి గగనము వంగినది ; 
మూపున వన్నెల హరివిల్లును మోస్తూ ;
=
neeli gaganamu wamginadi ; 

muupuna wannela hariwillunu mOstuu ;
;
9. నీలి గగనమా, లగ్నమెపుడమ్మ ;
ఇంద్రధనువుల ఏడు రంగుల కలయికకు ; 
=
neeli gaganamaa, lagnamepuDamma ;
imdradhanuwula EDu ramgula kalayikaku ;
;
10. సంపంగి దొన్నెలలొ సౌగంధ రాశి ;
ఆస్వాద రసములు, తోటతో పాటు నాకు కూడా  
=
sampamgi donnelalo saugamdha rASi ;
aaswaada rasamulu, tOTatO pATu naaku kUDA
;
11. మునిమాపుకు తన మూపున ;
తారకలను తెచ్చినది సంధ్యారాణి ;
munimaapuku tana muupuna ;
taarakalanu teccinadi samdhyaarANi ; nnela hariwillunu mOstuu ;

12. ప్రేమ సామ్రాజ్యాన సఖి నవ్వు ;
రెపరెపలాడేటి ఉజ్వల పతాకమ్ము
=
prEma saamraajyaana sakhi nawwu ;
reparepalADETi ujwala pataakammu

13. నెమలిపింఛమ్మునకు తగనంత గీర ;
నెలత నెమ్మోమును వేయింతలుగ -
తనదు నెమలి కన్నుల తోటి తిలకించగలుగుతున్నానని ;   
=
nemalipimCammunaku taganamta geera ;
nelata nemmOmunu wEyimtaluga -

tanadu nemali kannula tOTi tilakimcagalugutunnaanani ;
;
14. చెలి బుగ్గ సొట్టలలొ వెన్నెలంతా నిండె ;
ఆ చెంత - చేరినవి, సుదతి - పంటి మెరుపులందందున ;
ముక్కోటి శతకోటి దివ్య తారకలు ;
=
celi bugga soTTalalo wennelamtaa nimDe ;
aa cemta - cErinawi, sudati - pamTi merupulamdamduna ;

mukkOTi SatakOTi diwya taarakalu;
;
15. అష్ట భోగాలన్ని* ఇటనె నెలకొన్నవి ;
నెలత నడుము - మేను, కనురెప్పలు ;
వదన కాంతి, మునిపంటి నొక్కు ;
చెక్కిళ్ళ సొత్తలు, పగడాధరముల ప్రభలు ;
ప్రభవిల్లు భోగాల వైభోగములే తెలియ ;
[* ఇల్లు, పడక, వలువ, నగ ;
చందనం, తాంబూలం - స్త్రీ, పువ్వు ;-
ఇవి ఎనిమిది అనుభవ భోగములు ;
=
ashTa BOgaalann* - iTane nelakonnawi ;
 nelata naDumu - mEnu, kanureppalu ;
wadana kaamti, munipamTi nokku ;
cekkiLLa sottalu, pagaDAdharamula prabhalu ;
prabhawillu BOgaala waiBOgamulE teliya ;
[* illu, paDaka, waluwa, naga ;
stree, puwwu, camdanam, taambuulam - 

iwi enimidi anubhawa BOgamulu  ];
;
16. మదన వ్రతమును చేసె - 
మును జన్మలోన - ఆ ఐదు పువ్వులు* ;
మన్మధుని విల్లున పంచ పుష్పములాయె ;
=
madana wratamunu cEse -
munu janmalOna - aa aidu puwwulu* ;

manmadhuni willuna pamca pushpamulaaye ; 
;
17.  అనురాగ విలసిత గిల్లికజ్జాలు ;
ప్రేమ ముగ్గులలోన గొబ్బిదేవతలు ;
=
anuraaga wilasita gillikajjaalu ;

prEma muggulalOna gobbidEwatalu ;
;
18. ఝరిని నిలిచిన తరుణి - దోసిళ్ళలో నీళ్ళు ; 
అందు - బస చేసినవి, సంధ్యార్ణవమ్ములు - నీళ్ళాడ గోరి ; 

jharini nilicina taruNi - dOsiLLalO neeLLu ; 
amdu - basa cEsinawi, samdhyaarNawammulu - nILLADa gOri ; 
;
19. చిరుగాలికెప్పుడూ చెలి కురులతో రగడ ;
ఆ జగడాలు - రగడలై - కవి ఘంటములకందె ;
=
cirugaalikeppuDU celi kurulatO ragaDa ;
aa jagaDaalu - ragaDalai - kawi ghamTamulakamde ;
;
20. రాగమొకటి గాలిలోన తేలి తేలి వచ్చి ; 
ఘుమ ఘుమల ; మాటెలెన్నొ గుమ్మరించి ;
****************************************** ,
హైకూ తేనీలు - ;
హైకూ ద్విపాద తేనీలు - 141 - 160 

Saturday, December 16, 2017

హైకూ ద్విపాద తేనీలు - 121 - 140

1. గులాబీలు చిరుగాలికి ;  
కలల లిపిని హత్తినవి ; 
=
1. gulaabeelu ciru gaaliki ; 
  kalala lipini hattinawi ; 
;
2. చెలియ కురులే శరములవగా ; 
 నిలువ లేరు తిమిర వీరులెవరూ ; 
=
2] celiya కురులే Saramulaవగా ; 
 niluwa lEru timira weerulewaruu ;
;;
3. పుష్ప బాణాలన్నీ ఇటు వేసేసాడు ;
బహుశా అవి మరునికి బహుభారం ఐనవేమొ ;
;
4. సర్వదా భారం ఈ ప్రేమ ;
   వలదా!?, దాచగల మాయల పరదా  ;
;
5. అచ్చికబుచ్చికలాడే భ్రమరము ;
పుప్పొడి కొల్లలు గైకొని, మాయం  ; 
=
5. accikabuccikalADE bhramaramu ;
puppoDi kollalu gaikoni, maayam ;
;
6. మదనుని ఐదు శర పుష్పముల ;
పుప్పొడి జాతర - నిత్యం హోలీ ;
;
6. madanuni aidu Sara pushpamula ;
puppoDi jaatara - nityam hOlI ;
=
7. కో కో ఆటలు ఆడే బాలలు ;
నడిమి పరుగులు, వేసే ముగ్గులు ;;
=
7. kO kO ATalu ADE baalalu ;
naDimi parugulu wEsE muggulu ; 

8. చందనగంధం జాబిలి వెన్నెల ;

సేదదీర్చును పుడమిని సతతం ; 
;
9. నా కవితల తోటలోన ; 
విరిసినవి జవ్వని చిరునగవులు ; 
9. naa kawitala tOTalOna ; 
   wirisinawi jawwani cirunagawulu ; 
;
10. తురిమినాను నా కవితల కురులలోన నేను ; 
పరిమళాల పడతి నవ్వు పువ్వులన్నిటినీ నేడు ;

10. turiminaanu naa kawitala kurulalOna nEnu ; 
parimaLAla paDati nawwu puwwulanniTinee nEDu ;
;
11. మూతి ముడిచినది మగువ ;
మొగ్గ అనుకుని, వాలినది తుమ్మెద ;
=
11. muuti muDicinadi maguwa ;
mogga anukuni waalinadi tummeda ; 
;
12. పట్టు కుచ్చు సిరి మాలిక ; 
చెలి, ప్రణయ రాజ్య ఏలిక ; 

12. paTTu kuccu siri maalika ; 

celi, praNaya raajya ఏలిక ;
13. గడుసు మౌనం - వెల్లడించును కబురులెన్నెన్నో ;
మిడిసిపాటులేలనో 'పద - వి'పంచి కింకనూ ;  
=
13. గడుసు మౌనం - వెల్లడించును కబుర్లులెన్నెన్నో ;
miDisipATulElanO pada wipamcikimkanuu ;  
;
14. పద విపంచికి 
పదవి దొరకెను 
కావ్య రాజ్యాల ;
=
14. pada wipamciki ;
padawi dorakenu ;
kaawya raajyaala ;  
;
15. తరుణి భృకుటీ కుటీరమున ;
కుంకుమై మెరయుచుండును దినమణి ;
;
16. వంపుతున్నవి పూవులు ;
వన్నెలెన్నో 'వింతలవగా' ;
;
17. వస్త్రకళలకు వన్నెలు - 
'అద్దకముల వనితలు' ; 
;
18. పద విపంచికి - పదవి 

దొరకెను ; కావ్య రాజ్యాల ; 
;
19. వణికేను వెన్నెల- తొణుకాడగా 
తరుణీ మణి దరహాసాల వెల్లువ ;
=
19. waNikEnu wennela- toNukaaDagaa 

taruNee maNi darahaasaala welluwa ;
;
20.  కలువ కనుల చూపులకు బానిసలైనట్టి ;
ఈ స్వప్నాలది చెప్పలేనంతటి నస ;
;
హైకూ ద్విపాద తేనీలు - 121 - 140 ;
శత ద్విదళాలు ; డిసెంబర్ పోస్ట్ ; శత ద్విదళాలు ;