Wednesday, May 11, 2016

కాసె బోసి = ? ధోవతి, saree

కాసె బోసి ;- ధోవతి ధారణ ;-
ఈ మాట - వస్త్రాలను కట్టుకునే పద్ధతికి సంబంధించినది. 
రామ్ రాజ్ పంచెలు, 
పురుషుల సాంప్రదాయ వస్త్రధారణ, ఆహార్యాదులను 
ప్రజలకు గుర్తుకు తెస్తూన్న 
అడ్వర్టైజ్ మెంట్, ప్రకటన.
;
&&&&&&&
;
"ప్రేమించి చూడు" ఫిల్మ్ లో 
కోక [= చీర / శారీ / saree ]ను కట్టే బాణీతో - 
గీత రచన జరిగినది.
ఐతే, ధోవతిని కట్టే పద్ధతికి కూడా - 
"కాసె బోసి" - వర్తిస్తుందని అనుకుంటున్నాను. 
'బిళ్ళ గోచీ పెట్టి ధోవతిని కట్టే విధానం - మొదలైన 
పద లహరీ విలాసాలు ఉన్నవి. 
'ప్రేమించి చూడు ';- సినిమాలో 
ముళ్ళపూడి వెంకటరమణ కలం - 
తెలుగుదనానికి అద్దినట్టి చెమ్కీలు ఇవి.
[ నాగేశ్వరరావు, రాజశ్రీ, 
కాంచన, జగ్గయ్య, రేలంగి ప్రభృతులు నటించిన 
ఈ చలనచిత్రం - 
పాటలు, సినిమా కూడా సూపర్ హిట్.

&&&&&&&

బుచ్చబాయ్ పని కావాలోయ్! బుచ్చబాయ్ పని కావాలోయ్! || 
మేడ మీద మేడ కట్టి ; కోట్లు కూడబెట్టినట్టి కామందూ! 
అందుకుంటె జుట్టు పట్టి ; అందకుంటె కాళ్ళు పట్టి కామందూ! ||
బుచ్చబాయ్ పని కావాలోయ్! 
బుచ్చబాయ్ పని కావాలోయ్! ||
 హలో హలో కమాన్ ! come out! 
రా ముందు; దిగి రా ముందు; 
;
ఆడపిల్ల మాట మీద ; 
ఉద్యోగాలూడగొట్టు ఆకతాయి కామందూ!
మీసకట్టు తీసివేసి ;
కాసె బోసి ;
కోక కట్టి; గాజులేసుకొమ్మందూ! 
|| ఆడపిల్ల మాట మీద |||
;
డొక్క చీరివేస్తాం ; డోలు కట్టి తెస్తాం!! 
డోలు కట్టి,  గోల పెట్టి ;
రచ్చ కెక్కుతాం!  || డొక్క  ॥ 
;

రాత్రికి నేనొక రాక్షసినై ; నీ కలలో పీడిస్తా!
~~~~~ రాత్రికి నేనొక రాక్షసినై ; నీ కలలో పీడిస్తా!  
మాపటివేళకు నీ పని నే పడతానోయ్!! బుచ్చబాయ్! 
;  
మిన్ను విరిగి మీద పడ్డ ;
మన్ను, మిన్ను ఏకమైన;
నిన్ను మేము ; గెలిచే వరకూ ;
మేము ఆడి తీరుతాం!
పోరాడి తీరుతాం! 
|| బుచ్చబాయ్ పని కావాలోయ్! 
బుచ్చబాయ్ పని కావాలోయ్! ॥ 
;
********************************,

ఒక సామెత ;-
గోచీ విప్పి, తలపాగా చుట్టినట్లు.
"చిత్రి నెలలో చైత్రం 
దుక్కి; 
పుటం పెట్టిన పుత్తడి - "
;
ఉగాది వచ్చి, నిన్న మొన్నలా ఉన్నది. 
అప్పుడే చైత్రం దాటి వైశాఖంలోకి అడుగుపెట్టాము.
రైతు - గోచీ కట్టుతో 
మన కళ్ళలో మెదులుతూ, 
బొమ్మ కడతాడు. 
"గోచీ విప్పి తలపాగా చుట్టినట్లు." 
మొదలగు చాలా లోకోక్తులు ఉన్నవి.
=============================
#prEmimchi chUDu [ kaamchana ] ;-

kaase bOsi ;-
ii mATa - wastraalanu kaTTukunE paddhatiki sambamdhimchinadi. 
"Ram Raj pamchelu, Ram Raj banians" ;-
purushula saampradaaya wastradhaaraNa, aahaaryaadulanu prajalaku gurtuku testuunna aDwarTaij memT, prakaTana. 
kOka kaTTi; 
;
"prEmimchi chUDu" film lO kOkanu kaTTE bANItO - geeta rachana jariginadi.
aitE, dhOwatini kaTTE paddhatiki kUDA - "kaase bOsi" - wartistumdani anukumTunnaanu. 
'biLLa gOchii peTTi dhOwatini kaTTE widhaanam - modalaina pada laharii wilaasaalu unnawi. 
'prEmimchi chUDu '; sinimaalO muLLapUDi wemkaTaramaNa kalam - telugudanaaniki addinaTTi chemkiilu iwi. [ naagESwararaawu, raajaSree, kaamchana, jaggayya, rElamgi praBRtulu  naTimchina ii chalanachitram - pATalu, sinimaa kUDA suupar hiT.
 ] 

buchchabaay pani kaawaalOy buchchabaay pani kaawaalOy
;
[amdukumTe juTTu paTTi ; 
amdakumTe kALLu paTTi kaamamdu! duu! ; 
mEDa meeda mEDa kaTTi ; 
kOTlu kUDabeTTinaTTi kAmamdU! 
halO halO kamAn kamAn rA mumdu; 
digi raa mumdu; 
ADapilla mATa meeda ; 
udyOgaaluuDagoTTu aakataayi kaamadU!
meesakaTTu teesiwEsi ; 
kaase bOsi ;
kOka kaTTi; gaajulEsukommamdU! 
;  
Dokka cheeriwEstaam ; 
DOlu kaTTutaam! 
DOlu kaTTi gOla peTTi ;
rachcha kekkutaam! 
;
raatriki nEnoka raakshasinai ; 
nee kalalO pIDistA! 
maapaTiwELaku nii pani paTTEstA! 
;  
raatriki nEnoka raakshasinai ; 
nee kalalO pIDistA! 
maapaTi wELaku 
mii pani nEnu paDataanOy!
'minnu wirigi meeda paDDa ;
mannu, minnu Ekamaina;
ninnu mEmu ; 
gelichE warakuu ;
mEmu ADi teerutaam!
pOrADi tIrutaam! ||   
;
********************,
;
oka saameta;- 
;
gOchee wippi talapaagaa chuTTinaTlu 
chitri nelalO chaitram ] dukki; puTam peTTina puttaDi - 
ugaadi wachchi, ninna monnalaa unnadi. 
appuDE chaitram daaTi waiSAKamlOki aDugupeTTAmu.
raitu - gOchii kaTTutO mana kaLLalO medulutuu, bomma kaDatADu. 
"gOchee wippi talapaagaa chuTTinaTlu." modalagu chaalaa lOkOktulu unnawi.
 kuchchiLLu gOchii peTTi [one Telugu proverb] 
;

No comments:

Post a Comment