Friday, November 27, 2015

లావణీ నాట్యం in Telugu films

        
కొన్ని సినిమాలలోని పాటలు - గాయనీ గాయకుల సామర్ధ్యానికి నికషోపలాలు.
జగదేకవీరుని కథ - శివశంకరీ!; 
మురిపించే మువ్వలు "నీ లీల పాడెద దేవా!" 
మున్నగునవి.
ఈ జాబితాలోనివి.  
"రసికరాజ తగువారము కామా" అనే పాట, 
'జయభేరి' లోనిది.   
&&&&&&&&&&&

1947లో వి. శాంతారం తీసిన మరాఠీ సినిమా "లోక్ షేర్ రామ్ జోషి", 
హిందీ సినిమా "మత్‌వాలా శాయర్ రామ్ జోషీ"లు ఈ సినిమాకు మూలాలు
'లోక్ షేర్ రామ్ జోషీ' లోక్ షేర్ రామ్ జోషీ - 
అంటే "ప్రజాకవి రామ్" అని అర్ధం. 
వి. శాంతారామ్ 1947 లో నిర్మించిన ఈ సినిమా మరాఠీ భాషలోనూ, 
"మత్ వాలా శాయర్ రామ్ జోషీ' హిందీలోనూ బాక్సాఫీసు విజేత ఐనది. 
ఇంతకీ ఈ సినిమా గూర్చి ఎందుకు చెబుతున్నానంటే - 
ఈ చిత్రకథ ఆధారంగా తెలుగులో నాగేశ్వరరావు, అంజలీదేవి, శాంతకుమారి 
ఇత్యాదులు నటించిన గొప్ప హిట్ ఐన చలన చిత్రం , 
ఇందులోని పాటలు అన్నీ నేటికీ రసికజనమనోరంజనములు. 
మాలదాసరి కథ, గీతరూపకమని చెప్పవచ్చును. 
"నందుని చరితము వినుమా! పరమానందము కనుమా!" అంటూ 
ప్రేక్షకుల హృదయాలను కదిలించినారు. 
గుర్తుకు వచ్చింది కదూ! ఆ పేరు - "జయభేరి"
ఘంటసాల వెంకటేశ్వరరావు 100 సార్లు సాధన చేసి గానం చేసినది ఈ song. 
"రసికరాజ! తగువారము కాదా?
అగడు సేయతగునా?
ఏలు దొరవు,
అరమరికలు లేక,
ఏలవేల సరసాల సురసాల ......
నిన్ను తలచి గుణగానము చేసి,
దివ్యనామ మధుపానము చేసి ,
సారసాక్ష మనసా, వచసా .......... ;
రసికరాజ తగువారము కామా - పాటను 
ఘంటసాల పది రోజుల్లో 100సార్లు పైగా రిహార్సిల్ చేసుకొని పాడాడు.
ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి తీయబడింది. 
తమిళం పేరు "కళైవణ్ణన్". తమిళ సినిమా విడుదల ఆలస్యమయింది. 
తెలుగు సినిమా super hit , but Tamil movie - అంతగా విజయవంతం కాలేదు.
"రసికరాజ తగువారము కామా" all time super hit song. 
''''
లావణీ నాట్యం - మహారాష్ట్ర సీమలోనిది. 
లావని నర్తన ఫణితి -  మరాఠీ సాంప్రదాయమైన సంగీత, నాట్యాల మేళవింపు[Lavani]. 
ధోల్కీ / ఢోలక్ దరువుకు అనుగుణంగా వేగవంతమైన అడుగుల లయ - ఈ నాట్యభణితికి ప్రధాన ఆకర్షణ, 
కనుకనే ఈ మరాఠీ జానపద నృత్యాన్ని తెలుగు  వెండి తెరపై, తొలిసారి ఆవిష్కరించిన సినిమా 'జయభేరి '. 
&&&&&&&&&&&
'అగడు' = అర్ధం ఏమిటి? :- 
జయభేరి ;- జయభేరి - సినిమాలోని పాట 
"రసికరాజ తగువారము కామా -"
ఈ పాటలో  ‘అగడు' అనే తెలుగుమాట తమాషాగా వినపడుతుంది. 
"అగడు" అనే మాట ఉన్నది.
'అగడు' = అర్ధం ఏమిటి? చెప్పగలరా!?    

అగడు  = ఆగం / ఆగమాగం చేయుట - అని తెలుగులో, 
ఇంకా - అల్లరి పెట్టుట, రచ్చ చేయుట; 
"రచ్చ రచ్చ" ఇత్యాది వాడుకలో ఉన్న పదాలు! 

;;;;;;;;;
ఈ చిత్రకథకు పునాది నాట్య, సంగీతాలు. మరాఠీ ‘లావణి’ నాట్యం ప్రాచుర్యం కలిగినది. 
శాంతారాం వలన లావణి, తమాషా – నృత్యరీతులు, సినీరంగంలో కొత్త ట్రెండుగా సృష్టించబడినవి.  
&&&&&&&&&&&

“పంతాలు - పట్టింపులు” అనే సినిమా కూడా తెలుగులో లావణి
విభిన్న నాట్యఫణితుల చిత్రణ జరిగింది. 
వాణిశ్రీ, శోభన్ బాబు, గీతాంజలి, గుమ్మడి -  మున్నగువారు నటించారు.   

***************************************************,
  [ శీర్షిక : సుమదళాలు ] post - fb ;- రాగాలు మేళవింప_ హృదయాలు పరవశింప ;  

No comments:

Post a Comment